దేశీపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో పంత్నగర్ ప్లాంటులో ఉత్పత్తి విస్తరణ పనులు ప్రారంభించనుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపు ద్వారా కేవలం కంపెనీ ప్రాఫిట్ మార్జిన్లను పెంచుకోవడమే కాకుండా.. ఉత్తరాఖాండ్ కన్సెషనల్ ఇండస్ట్రియల్ ప్యాకేజ్ (సిఐపి) 2003లోని టాక్స్ బెనిఫిట్‌లను పొందాలని కంపెనీ భావిస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. తాజా ఉత్పత్తి పెంపుతో ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ప్రతి నెలా 1,50,000 యూనిట్లకు పెరగనుంది. ఇందుకోసం కంపెనీ రూ. 75 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ ప్లాంటు సామర్థ్యం సాలీనా 12 లక్షల యూనిట్లుగా ఉంది, అయితే ఆటో మార్కెట్లో ఉన్న మంచి డిమాండును దృష్టిలో ఉంచుకొని దీన్ని 18 లక్షలకు పెంచాలని కంపెనీ యోచిస్తుంది. ఇటీవల ఉత్తరాఖాండ్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లలో పరిశ్రమలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఈసి) కొండ ప్రాంతాల ఇన్సెంటివ్‌ల కింద ఎక్సైజ్ సుంఖాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించడంతో కంపెనీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.