గుజరాత్‌కు తరలి వెళ్లనున్న బజాజ్‌ చిన్న కారు ప్రాజెక్ట్!

Bajaj ULC Car
మహారాష్ట్ర సర్కారుకు మరియు బజాజ్ ఆటో సంస్థకు మధ్య దూరం మరింత పెరుగుతోంది. సేల్స్ టాక్స్ రీఫండ్ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమ్మకాల పరంగా భారత మార్కెట్లో రెండో స్థానంలో ఉన్న బజాజ్ ఆటో, టాటా నానోకు పోటీగా అభివృద్ధి చేస్తున్న ఆల్ట్రా లో-కాస్ట్ చిన్న కారు ప్రాజెక్ట్ గుజరాత్ రాష్ట్రానికి తరలివెళ్లే అవకాశాలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

పారిశ్రామిక రంగానికి పెద్దపీట కల్పిస్తూ మోడి సర్కారు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు ఆటోమొబైల్ కంపెనీలను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ఈ మేరకు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సమీపంలో ప్లాంటు ఏర్పాటు చేయాలని బజాజ్ ఆటో భావిస్తోంది. ఈ విషయంపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ స్పందిస్తూ.. ముంద్రా ప్రాంతంలో భుమి దొరికితే సంతోషిస్తామని, ఇందుకు సంబంధించి గుజారత్ సర్కారుతో ఏ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నామని తెలిపారు.

ముంద్రాలో ప్లాంటు ఏర్పాటు చేయడం ద్వారా ఆఫ్రికా దేశాల వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులను సులభతరం చేసుకోవచ్చునని కంపెనీ భావిస్తోంది. కాగా.. ఇప్పటికే గుజరాత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు దేశీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రయత్నిస్తుండగా, అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ మరియు ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ప్యూజో సిట్రాన్‌లతో భారత్ నెంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో హోండా కూడా గుజరాత్ రాష్ట్రం వైపు మొగ్గు చూపుతోంది.

More from DriveSpark

Article Published On: Friday, July 22, 2011, 16:38 [IST]
English summary
India's second largest two-wheeler manufacturer Bajaj Auto Limited (BAL) contemplating to move out from Maharashtra due to the Sales Tax issue with government.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+