2012 వరకూ బజాజ్ యూఎల్‌సీ ప్రాధాన్యం కాదు: రీనాల్ట్

Bajaj ULC
టాటా మోటార్స్ బుజ్జి కారు టాటా నానోతో పోటీ పడలేమని ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రీనాల్ట్ చేతులెత్తేసింది. ఇప్పటికే బజాజ్ ఆటో, నిస్సాన్ మరియు రీనాల్ట్ సంస్థలు సంయుక్తంగా చేతులు కలిపి టాటా నానో కన్నా తక్కువ ధరకే ఓ కారును ఓ ఆల్ట్రా లో కాస్ట్ (యూఎల్‌సీ) వాహనాన్ని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ జేవీలో తమ పాత్ర ఎంత వరకూ ఇప్పట్లో చెప్పలేమని రీనాల్ట్ పేర్కొంది. రానున్న రెండేళ్ల వరకూ టాటా నానో కారుకు పోటీగా చౌక కారును విడుదల చేయబోవడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. రీనాల్ట్ కంపెనీ వ్యాఖ్యలను బట్టి ఈ మూడు కంపెనీల జాయింట్ వెంచర్‌ నుంచి రీనాల్ట్ తప్పుకునే అవకాశాల ఎక్కువగా ఉన్నాయని, తామే స్వతహాగా భారత మార్కెట్ కోసం ఓ చిన్న కారును విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

రీనాల్ట్ గతంలో 2012 లోగా టాటా నానోకు పోటీగా ఓ చిన్న కారును మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని సంస్థ రీనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్క్‌ నాసిఫ్‌ తెలిపారు. 2011 చివరి నాటికి దేశీయ మార్కెట్లోకి మరో ఐదు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నామని, మార్కెట్ డిమాండుకు అనుగుణంగా వీటి ఉత్పత్తి ఉండబోతుందని ఆయన తెలిపారు. ప్రజల కారు టాటా నానో కోసం రతన్ టాటా కల మాదిరిగానే అల్ట్రా లో కాస్ట్‌ కారును తయారు చేయాలన్నది రినాల్ట్‌ - నిస్సాన్‌ చీఫ్‌ కార్లోస్‌ ఘోస్న్‌ కల అని నాసిఫ్ అన్నారు. ప్రస్తుతం రీనాల్ట్ భారత మార్కెట్లో తమ తొలి లగ్జరీ సెడాన్ ఫ్లూయెన్స్ కారును మాత్రమే అందిస్తుంది. ఈ ఏడాది తమ ఎస్‌యూవీ కొలియోస్‌ను వచ్చేఏడాది మరో ఎస్‌యూవీ 'డస్టర్‌'తో పాటు, ఒక హ్యాచ్‌బ్యాక్ మరియు ఒక సెడాన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Friday, June 24, 2011, 10:20 [IST]
English summary
Renault, the French car maker has said that it will launch five models in the year 2012 and the proposed ultra low cost (ULC) car with Bajaj Auto for the Indian market has the least priority till 2012, the year scheduled for its launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+