సంక్షోభంలో పడనున్న బజాజ్ ఆల్ట్రా లో కాస్ట్ కారు ప్రాజెక్ట్

గతంలో ఈ చిన్నకారుపై బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. తాము విడుదల చేయబోయేది ఖచ్చితంగా కారే కావల్సిన అవసరం లేదని, అది ఓ ఫోర్-వీలర్ మాత్రమేనని చెప్పారు. లీటర్‌కు 30 కిలోమీటర్ల మైలేజిని ఇచ్చే విధంగా తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా ఓ ఫోర్‌వీలర్‌ను అభివృద్ధి చేస్తున్నామని, ఇది మోటార్‌సైకిల్/త్రీ-వీలర్ ప్రతిభ నుంచి పుట్టుకొచ్చినదని, ఇది ఓ ప్రైవేట్ వాహనంగా మరియు ఓ టాక్సీలాగా రెండు విధాలుగా ఉపయోగపడగలదని, ఈ ఫోర్-వీలర్‌ను ఔరంగాబాద్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నామని రాజీవ్ అన్నారు.
నిజానికి ఈ వాహనాన్ని ఉత్పత్తి చేస్తున్నది పూర్తిగా బజాజ్ కంపెనీయే. ఈ జాయింట్ వెంచర్‌లో నిస్సాన్, రీనాల్ట్ కంపెనీలు ఈ ప్రోడక్ట్‌ను కేవలం మార్కెటింగ్ మాత్రమే చేస్తాయి. ఇదే విషయాన్ని గతంలో రాజీవ్ బజాజ్ కూడా స్పష్టం చేశారు. ఈ జాయింట్ వెంచర్‌కు తమ పోర్-వీలర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా బజాజ్ ఆటో వ్యక్తిగత ప్రాజెక్ట్ అని, ఈ ప్రోడక్ట్ అభివృద్ధి, తయారీ బాధ్యతలు పూర్తిగా 100 శాతం తమదేనని ఆయన తెలిపారు. కాగా.. తొలిసారిగా తమ స్వంత కారుతో భారత మార్కెట్లో అడుగుపెట్టిన రీనాల్ట్, బజాజ్ రూపొందిస్తున్న యూఎల్‌సీ కారు నాణ్యత విషయంలో తమ పరిమితులను సంతృప్తి పరిస్తేనే ఈ ఉత్పత్తిని మార్కెట్ చేస్తామని పేర్కొంది.
ఈ సోమవారం భారత మార్కెట్లోకి తమ తొలి లగ్జరీ కారు "ఫ్లూయెన్స్"ను విడుదల చేసిన సందర్భంగా రీనాల్ట్ ఇండియా ఛీఫ్ మార్క్ నాసిఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. బజాజ్ ఉత్పత్తి చేస్తున్న ఈ వాహనాన్ని ఇంతవరుకూ రీనాల్ట్ కూడా చూడలేదట. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను బట్టి గమనిస్తే.. భారత మార్కెట్లో ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న రీనాల్ట్, నాణ్యత విషయంలో ఒకవేళ బజాజ్ యూఎల్‌సీ ప్రోడక్ట్ వినియోగదారులను సంతృప్తి పరచలేకపోతే ఆ ప్రభావం తమ స్వంత బ్రాండ్‌పై పడే అవకాశం ఉందని ముందుగా ఊహించి చేసినట్లు తెలుస్తుంది. మరి బజాజ్ ఓ కారునే విడుదల చేస్తుందో లేక ఓ కమర్షియల్ వెహికల్‌నే విడుదల చేస్తుందో తెలియాలంటే 2012 వరకూ వేచి చూడక తప్పదు.


Click it and Unblock the Notifications








