బెంట్లీ నుంచి మరో సూపర్ లగ్జరీ కారు రూ. 1.9 కోట్లు

లగ్జరీ ఆటోమొబైల్ విభాగంలో భారత్ వేగంగా విస్తరిస్తోందని, వచ్చే ఏడాది నాటికి భారత మార్కెట్లో తమ అన్ని రకాల లగ్జరీ కార్లను 100 యూనిట్లను విక్రయించగలమని బెంట్లీ రీజనల్ డైరెక్టర్ (ఇండియా) క్రిస్ బుక్స్టన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌లోని క్రూ ప్రాంతానికి చెందిన బెంట్లీ కంపెనీ 1946వ సంవత్సరం నుంచి కార్లను ఉత్పత్తి చేస్తుంది.
భారత్‌లో ఈ ఏడాది దాదాపు 45 కార్లను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. అలాగే 2011లో ప్రపంచ వ్యాప్తంగా 7,000 కార్లను అమ్మాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2011లో భారత సూపర్ లగ్జరీ కార్ మార్కెట్ 30 శాతం వృద్ధి చెంది దాదాపు 600-700 యూనిట్లకు పెరగవచ్చునని బుక్స్టన్ అంచనా వేశారు. భారత్‌లో బెంట్లీ విక్రయాలు ఏటా 45 శాతం వృద్ధిని సాధిస్తున్నాయని ఆయన చెప్పారు.
12-సిలిండర్ల ఇంజన్ కలిగిన కాంటినెంటల్ జిటి రెండు డోర్లను కలిగి ఉంటుంది. ఇది గంటకు 318 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో ఉన్న రెండు డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా బెంట్లీ తమ కార్లను విక్రయిస్తుంది. బెంట్లీ జర్మనీకు చెందిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు సంబంధించినది.


Click it and Unblock the Notifications








