నానోను పాక్‌కు తీసుకు వెళ్లేందుకు వాణిజ్య సంస్థల సన్నాహాలు

పాకిస్థాన్‌కు చెందిన ఓ బిజినెస్ హౌస్ "ఇంటర్నేషనల్ మల్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్" (ఐఎమ్‌జిసి) భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ నుంచి నానో మరియు సిఎన్‌జి బస్సులతో కలిపి వాహనాలను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు టాటా గ్రూపుకు ఓ లేఖను కూడా పంపినట్లు ఐఎమ్‌జిసి గ్లోబల్ ఛైర్మన్ అంజాద్ రషీద్ చెప్పారు. తొలుత సిఎన్‌జి బస్సులపై తాము ఆసక్తి కనబరుస్తాన్నామని, తర్వాతి కాలంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య వర్తకంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తే నానో కారును పాకిస్థాన్ తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.
ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. పాకిస్థాన్‌కు టాటా మోటార్స్ పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను ఎగుమతి చేయాలి. లేదా అక్కడే ఓ అసెంబ్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేసుకొని టాటా తమ ఉత్పత్తులను అసెంబ్లింగ్ చేసుకోవాలి. అయితే ఇదే సమయంలో పాకిస్థాన్ దేశంలో జాయింట్ వెంచర్‌లు లేదా పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు నియమాలు అంగీకరించవు. గత నెలలో ఇరు దేశాల వాణిజ్య కార్యదర్శలు సమావేశమైన సందర్భంగా భారత వాణిజ్య కార్యదర్శి రాహుల్ కుల్లార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చామని, ఈ ఆంక్షలను ఎత్తివేస్తామని తమకు హామీ ఇచ్చారని రషీద్ చెప్పారు.


Click it and Unblock the Notifications








