3-ఇండియన్స్‌తో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ

ఈ విషయాన్ని బిఎమ్‌డబ్ల్యూ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్‌చార్జ్ ఇయానా రాబర్ట్‌సన్ ధృవీకరించారు. ఈ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు.. పబ్లిక్ ట్రాన్సోపోర్టేషన్, అమెరికాలోని దాదాపు 40 నగరాల్లో కవరయ్యే లోకల్ ఎంటర్‌టైన్‌మెంట్, అన్నింటి కన్నా ముఖ్యమైనది ఐడిల్ పార్కింగ్ ఫెసిలిటీ వంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే దశలో భాగంగా మునిచ్‌కతో పాటు మరో 40 నగరాలను జోడీకరించనున్నట్లు ఆయన తెలిపారు. చెన్నయ్‌కు చెందిన అర్చనా పచ్చిరాజన్, ఛండీఘడ్‌కు చెందిన పునీత్ మెహతా, న్యూఢిల్లీకు చెందిన సన్‌ప్రీత్ భాటియాలు మైసిటీవే అప్లికేషన్‌కు ప్రాణం పోశారు. కాగా వీరి ఆలోచనలను కార్యరూపంలో పెట్టేందుకు బిఎమ్‌డబ్ల్యూ ఊతమిచ్చింది.
ఈ ముగ్గురి త్రయం తొలుత "ఎన్ వై సి వే" (న్యూ యార్క్ సిటీ వే) అనే ట్రావేల్ అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ అప్లికేషన్‌కు న్యూయార్క్ వాసుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ఈ ఎన్‌వైసివే అప్లికేషన్ ద్వారా న్యూయార్క్ వాసులు లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్, రెస్టారెంట్ ఇన్స్‌పెక్షన్ రిజల్ట్స్, లోకల్ క్రైమ్ డేటా, వై-ఫై లోకేషన్లు వంటి సమాచారాన్ని మొబైల్‌లోనే పొందవచ్చు. ఈ అప్లికేషన్ సృష్టికర్తలు త్వరలోనే భారత్‌లోని నాలుగు ప్రధాన నగారాల్లో (ముంబై, చెన్నయ్, బెంగుళూరు, ఢిల్లీలలో) పరిచయం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. బిఎమ్‌డబ్ల్యూ ఇటీవల విడుదల చేసిన సబ్-బ్రాండ్ 'బిఎమ్‌డబ్ల్యూ ఐ'లో కూడా మైసిటీవే అప్లికేషన్ భాగం కానుంది. ఏదేమైనప్పటికీ వీరు ముగ్గురు మన ఇండియన్స్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలుపనున్నారు.


Click it and Unblock the Notifications








