భారత్‌కు రానున్న బిఎమ్‌డబ్ల్యూ ఐ-బ్రాండ్ కార్లు

BMW Electric Cars
భారత కార్ మార్కెట్లోని ప్రీమియం కార్ల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇకపై ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోనూ తన హవా చూపిస్తానంటోంది. ఈ మేరకు బిఎమ్‌డబ్ల్యూ అభివృద్ధి చేసి ఇటీవల గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసిన ఐ3, ఐ8 అనే ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్‌లో కూడా విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. 2013-14 నాటికి ఈ బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్లు భారత రోడ్లపై పరుగులు తీయనున్నాయి.

ప్రస్తుతం ఈ కార్లను తొలుతగా జర్మనీలో విడుదల చేస్తున్నామని, భారత్‌తో కలిపి వివిధ అంతర్జాతీయ మార్కెట్లలోనూ వీటిని ప్రవేశపెట్టాలని తమ మనస్సులో ఉందని, అయితే ఇది భవిష్యత్తులోనే జరుగుతుందని బిఎమ్‌డబ్ల్యూ మేనేజ్‌మెంట్ బోర్డ్ చైర్మన్ డా. నార్బెర్ట్ రీథోఫెర్ తెలిపారు.

కాగా.. బిఎమ్‌డబ్ల్యూ ఐ3 కాన్సెప్ట్ కారులో నలుగురు ప్రయాణికులు కూర్చుని హాయిగా ప్రయాణించవచ్చు. ఇది ప్రత్యేకించి నగర ప్రాంత ప్రజలను మరియు రోడ్లను దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. ఇది కేవలం 8 సెండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇకపోతే.. ఐ8 కాన్సెప్ట్ డైనమిక్ డ్రైవింగ్‌ను కోరుకునే వారికోసం రూపొందించబడినది. ఇది ఓ స్పోర్ట్ కార్ లుక్‌ను మరియు డ్రైవింగ్ అనుభూతిని కల్పిస్తుంది. ప్రారంభ దశలో భాగంగా ఈ మోడళ్లను ఎంపిక చేసిన ప్రధాన నగరాలకు మాత్రమే కంపెనీ పరిమితం చేయనుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 5, 2011, 15:56 [IST]
English summary
German luxury car maker BMW's latest invention of its all new i-brand electric cars may hit the Indian roads in two-three years. The company had recently unveiled their i3 and i8 concepts in Frankfurt auto show.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+