లగ్జరికార్ల అమ్మకాలలో బియమ్ డబ్ల్యు ముందంజ

BMW
లగ్జరీ కార్లు తయారీ సంస్దలు అయినటువంటి బియమ్ డబ్ల్యు, ఆడి, మెర్సిడెస్ బెంజ్ 2010లో మంచి లాభాలను ఆర్జించాయని ఆటోమొబైల్స్ నిపుణులు వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2010వ సంతవత్సరంలో బియమ్ డబ్ల్యు ఆడి, మెర్సిడెస్ బెంజ్ కార్ల సేల్స్ ను వెనక్కు నెట్టి మరి మొదటి స్దానంలో నిలచింది. ఆసియా మార్కెట్ లో చూసుకున్నట్లైతే లగ్జరీ కార్లు అమ్మకాలలో బియమ్ డబ్ల్యు దూసుకుపోతుందని అన్నారు. సంవత్సరానికి 15000యూనిట్లు సామర్ద్యం ఉన్నటువంటి బియమ్ డబ్ల్యు 2010లో అధికంగా 6246యూనిట్లు అమ్మి 73శాతం వృధ్ధిని నమోదు చేసింది. బియమ్ డబ్ల్యు చైనా తోకనుక పోల్చుకున్నట్లైతే బియమ్ డబ్ల్యు ఇండియా వృద్ది రేటు మూడవ స్దానంలో ఉంది. అంతేకాకుండా ఇండియా, కోరియా దేశాలు రెండూ ఓకేరకమైనటువంటి వృధ్దిరేటును సాధిస్తున్నాయని బియమ్ డబ్ల్యు ఇండియా ప్రెసిడెంట్ వెల్లడించారు.

2010వ సంవత్సరంతో కలుపుకోని వరుసగా రెండు సార్లు లగ్జరీ కార్ల సెగ్మెంట్ లో టాప్ పోజిషన్ లో బియమ్ డబ్ల్యు నిలచింది. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతానికి కస్టమర్స్ నుండి బియమ్ డబ్ల్యు మంచి ఆర్డర్స్ నికూడా సంపాదించుకోగలుగుతుంది. ఇలా ఇంకా ముందుకు సాగిపోతామని అన్నారు. ఇక మెర్సిడెస్ బెంజ్ విషయానికి వస్తే 2010వ సంవత్సరానికి మొత్తం 5819యూనిట్లను మాత్రమే మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలను నమోదు చేయగలిగింది. ముఖ్యంగా ఇ-క్లాస్ మోడల్స్ లో 2490యూనిట్లను అమ్మగా, సి-క్లాస్ మోడల్స్ 2070 అమ్మకాలను, అదేవిధంగా యస్ యువి లో 523 యూనిట్లు అమ్మకాలు జరుపుకున్నాయని అన్నారు.

గత అమ్మాకాలతో పోల్చుకున్నట్లైతే 2010సంవత్సరంలో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయని తెలిపారు. ఇక మరోక లగ్జరి కార్లు తయారీ సంస్ద అయినటువంటి ఆడి విషయానికి వస్తే ఆడి కూడా గతంలో పోల్చుకున్నట్లైతే ఈసంవత్సరం 81శాతం వృధ్ధిని సాధించింది. 2010వ సంవత్సరంలో ఆడి మొత్తం 3003 అమ్మకాలను నమోదు చేసింది. ఈసందర్బంలో డైరెక్టర్ ఆడి ఇండియా మాట్లాడుతూ కంపెనీకి చాలా గర్వంగా ఉంది. దానికి కారణం వరుసగా మూడవ సంవత్సరంలో కూడా మంచి అమ్మకాలను నమోదు చేసినందుకు అని అన్నారు. ఇది మాత్రమే కాకుండా త్వరలో ఆడి నుండి మరోకోన్ని లగ్జరి కార్లు రాబోతున్నట్లు వివరించారు. అందులో భాగంగా ఆడి 8 సీడాన్ వర్సన్స్ తోపాటుగా ఏ6, ఏ7 లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 11, 2011, 11:36 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+