సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించనున్న బిఎమ్‌డబ్ల్యూ

BMW
జపాన్‌కు చెందిన ఫోక్స్‌వ్యాగన్, అమెరికాకు చెందిన ఫోర్డ్ వంటి విదేశీ కంపెనీలు భారత సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో విజయవంతంగా రాణిస్తుండటంతో.. దేశపు నెంబర్ వన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా కూడా ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్లో ప్రవేశించుకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకపు వ్యాపారంలోకి ప్రవేశిస్తామని పూణేలో కొత్త అవుట్‌లెట్ ప్రారంభోత్సవం సందర్భంగా కంపెనీ పేర్కొంది. అయితే సింగిల్ బ్రాండ్ షోరూమ్ (బిఎమ్‌డబ్ల్యూ కార్లు మాత్రమే విక్రయించేవి) ఏర్పాటg చేస్తారా లేక మల్టీ బ్రాండ్ షోరూమ్‌ ఏర్పాటు చేస్తారా అనే విషయాన్ని మాత్రం కంపెనీ స్పష్టం చేయలేదు.

భారత్‌లో ప్రీ-ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) కార్లకు భారీ డిమాండ్ ఉందని, ఈ అక్టోబర్ నాటికి సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నామని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియా స్కాఫ్ వ్యాఖ్యానించారు. దీంతో పాటు కంపెనీ దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లో మరిన్ని డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. గడచిన దశాబ్ధాలుగా భారత మార్కెట్లో నెంబర్ వన్‌గా నిలుస్తున్న మెర్సిడెస్ బెంజ్‌ను ఇటీవలే బిఎమ్‌డబ్లూ వెనక్కు నెట్టి భారత లగ్జరీ కార్ మార్కెట్‌కు లీడర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తన స్థానాన్ని అలానే పదిలంగా ఉంచుకునేందుకు బిఎమ్‌డబ్ల్యూ భారీ కసరత్తులు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 16, 2011, 16:38 [IST]
English summary
After observing the success of its competitors like Ford India and Volkswagen, Now Country's largest luxury car maker BMW India is looking to enter into the pre-owned car market in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+