చెన్నయ్ ప్లాంటులో ఉత్పత్తిని 10,000 పెంచిన బిఎమ్‌డబ్ల్యూ

2010లో భారత లగ్జరీ కార్ సెగ్మెంట్లో బిఎమ్‌డబ్ల్యూ విక్రయాలలో 73 శాతం వృద్ధితో 6,246 యూనిట్లను విక్రయించి, ఈ విభాగంలో మరో లగ్జరీ కార్ల దిగ్గజం అయిన మెర్సిడెస్ బెంజ్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. ఇదే సమయంలో బెంజ్ విక్రయాలు విక్రయాలు 80 శాతం వృద్ధితో 5,819 యూనిట్లుగా ఉన్నాయి. కాగా.. ఈ ఏడాది మధ్య భాగంలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) ఎక్స్3 యెక్క సరికొత్త వెర్షన్‌ను బిఎమ్‌డబ్ల్యూ విడుదల చేయనుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3ను విడిభాగాలుగా జర్మనీ నుంచి దిగుమతి చేసుకొని చెన్నయ్ ప్లాంటులో అసెంబ్లింగ్ చేస్తుంది.
ఇలా దిగుమతి చేసుకునే విడిభాగాలను కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్ (సికెడి) యూనిట్లు అని, ఈ వ్యాపారాన్ని సికెడి వ్యాపారం అని అంటారు. ప్రస్తుతం ఈ ప్లాంటులో 3-సిరీస్, 5-సిరీస్, ఎక్స్1 కార్లను బిఎమ్‌డబ్ల్యూ అసెంబ్లింగ్ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1ను కంపెనీ గత డిసెంబర్ నెలలో భారత్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. పెట్రోల్ వేరియంట్‌లో లభించే ఎక్స్ కారు ధర రూ. 22 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఆల్-ఇండియా)గా ఉంది. ఇకపోతే దీని డీజిల్ వేరియంట్ రెండు ఆప్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 23.9 లక్షలు మరియు రూ. 29.9 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఆల్-ఇండియా)గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








