ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా భారత్‌లో తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను 2015 నాటికి మూడు రెట్లకు పెంచుకోవాలని భావిస్తుంది. ఢిల్లీ, ముంబై వంటి కీలక మార్కెట్లపైనే ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఈ చర్యలు ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఎన్నో ఏళ్లుగా భారత మార్కెట్లో అగ్రగామిగా ఉన్న మెర్సిడెస్ బెంజ్‌ను ఓవర్‌టేక్ చేసి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ప్రస్తుతం భారత్‌లో 22 డీలర్లను కలిగి ఉంది. 2015 నాటికి తమ డీలర్ల సంఖ్యను 60కు పెంచనున్నామని, ఫలితంగా ఢిల్లీ, ముంబై మార్కెట్లపై వత్తిడి 60 శాతం నుంచి 40 శాతానికి తగ్గుతుందని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ వెల్లడించారు.
కొత్త డీలర్ల ద్వారా ఇతర రీజన్లలో సేల్స్‌ను పెంచుకోవడం దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ఈ 60 డీలర్‌షిప్‌లు చాలా తక్కువే అయినప్పటికీ భవిష్యత్ అభివృద్ధికి ఇవి పునాదుల్లాంటివని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది లగ్జరీ కార్ మార్కెట్లో పోటా పోటీ (మెర్సిడెస్ బెంజ్‌తో) రేస్ జరిగిందని, ఈ ఏడాది తమ కంపెనీ గతేడాది కన్నా వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. 2020 సంవత్సరం నాటికి భారత లగ్జరీ కార్ మార్కెట్ డిమాండ్ 1,50,000 యూనిట్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. ఈ ఏడాది ముగిసేనాటికి 10,000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది.