బిఎమ్‌డబ్ల్యూకు చెమటలు పట్టిస్తున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్

BMW-JLR
టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటన్ యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) నుంచి ఒక్కో మోడల్‍‌ను భారత్‌కు దింపుతుండటం, ప్రస్తుతం భారత లగ్జరీ కార్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూకు చెమటలు పట్టిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్‌కు భారత మార్కెట్లో కూడా ఆదరణ బాగుండటంతో.. జేఎల్ఆర్ తమకు గట్టి పోటీదారుగా నిలబడగలది బిఎమ్‌డబ్ల్యూ పేర్కొంది. త్వరలో బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్న ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) ఎక్స్3 మోడల్‌తో పాటు మరిన్ని మోడళ్లకు జేఎల్ఆర్ పోటీ ఇవ్వగలదని బిఎమ్‌డబ్ల్యూ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

"నేను అది (జేఎల్ఆర్) కాంపిటీషన్ కాదని చెబితే, అది తప్పు అవుతుంది. ఖచ్చితంగా అది కాంపిటీషనే" అని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ వెల్లడించారు. గోవాలో కొత్త డీలర్‌షిప్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా బ్రిటీష్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ గురించి విలేఖరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చూస్తుంటే... మార్కెట్ పోటీని తట్టుకునేందుకే కంపెనీ శరవేగంగా విస్తరణ కార్యకలాపాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నాటికి మొత్తం డీలర్ల సంఖ్యను 40కు అలాగే 2015 నాటికి 60కు పెంచుకోవాలని కంపెనీ నిర్ణయించింది. ఇంకా చిన్న పట్టణాల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కూడా బిఎమ్‌డబ్ల్యూ ప్రయత్నిస్తోంది.

కాగా.. లగ్జరీ వాహన మార్కెట్లో మరింత వేడి పుట్టించేదుకు టాటా మోటార్స్ తమ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్‌లోని మోడళ్లను ఒక్కొక్కటిగా భారత రోడ్లపైకి తీసుకు వస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి బ్రాండ్‌ల సరసన జేఎల్‌ఆర్‌ను కూడా చేర్చాలని టాటా మోటార్స్ భావిస్తోంది. 2008లో బ్రిటన్‌కు చెందిన జేఎల్ఆర్‌ను టాటా మోటార్స్ సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ కంపెనీ దాదాపు దివాళా తీసే స్థితిలో ఉంది. కానీ జేఎల్ఆర్‌ను టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న ఆ కంపెనీ రూపు మారడంతో టాటా మోటార్స్ ప్రతిష్టను కూడా ప్రపంచానికి తెలియజెప్పింది. టాటా చేతికి జేఎల్ఆర్ బ్రాండ్ రావడంతో లగ్జరీ కార్ మార్కెట్లో యుద్ధానికి టాటాకు బ్రహ్మాస్త్రం లభించినట్లయింది.

More from DriveSpark

Article Published On: Friday, June 10, 2011, 9:18 [IST]
English summary
Tata Motors owned British luxury car maker Jaguar Land Rover (JLR) models in India will certainly provide competition to BMW in the domestic luxury car market. "It would be wrong if I say it's (JLR) not a competition. It's certainly a competition," BMW India President Andreas Schaaf said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+