భారత్‌లో 6-సిరీస్ కారును విడుదల చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ

ఎల్ఈడితో కూడిన టెక్నికల్ హెడ్‌ల్యాంప్ గ్రాఫిక్స్, బంపర్ దిగువ భాగంలో ఏర్పాటు చేసిన పూర్తి వెడల్పాటి ఎయిర్ డక్ట్, పాత వెర్షన్ల కన్నా వెడల్పాటి బానెట్ వంటి వాటితో ఈ కారును డిజైన్ చేయడం జరిగిందని కంపెనీ తెలిపింది. కారు లోపల ముందువైపు అధిక స్థలం కోసం దీని వీల్‌బేస్‌ను పెంచడం జరిగింది. ఈ కూప్ మోడల్ కారులో రెండు డైరెక్ట్-ఇంజెక్షన్ కంబైన్డ్ పెట్రోల్ ఇంజన్‌తో సహా 8 ఆటోమేటిక్ గేర్లు కలిగిన గేర్‌బాక్స్ ఉంటుంది. 6-సిరీస్‌లో బేస్ మోడల్ అయిన 640i కారు 3.0 లీటర్ టర్బోచార్జ్‌డ్ ఇంజన్‌తో 320 బిహెచ్‌పి శక్తి, 45 కెజిమ్ టార్క్‌లతో కేవలం 5.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
కాగా.. 6-సిరీస్‌లో విడుదల కానున్న ఈ లేటెస్ట్ మోడల్ కూప్ గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇక ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే.. ఇది లీటరుకు 14.88 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇప్పటి వరకూ 6-సిరీస్‌లో ఉన్న హై-ఎండ్ వేరియంట్ 650i కారు 4.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ వీ8 ఇంజన్‌తో 407 బిహెచ్‌పి శక్తి, 61.2 కెజిమ్ టార్క్‌లో కేవలం ఐదు సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది లీటరుకు కేవలం 11.05 కిలోమీటర్ల మైలేజ్‌ను మాత్రమే ఇస్తుంది.


Click it and Unblock the Notifications








