రూ. 95 లక్షల ధరతో బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ కారు విడుదల

BMW 6 Series
లగ్జరీ కార్ల విక్రయాలలో భారతదేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న ప్రముఖ జర్మన్ ప్రిమీయం కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో మరో సరికొత్త లగ్జరీ కారును ఆవిష్కరించింది. లగ్జరీ కారు "బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్‌"ను దేశీయ మార్కెట్లో రూ. 95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ ఒక ఆల్ట్రా-లగ్జరీ కారు అని, ఇది పూర్తిగా భారత్‌లోనే తయారైందని 'బిఎమ్‌డబ్ల్యూ ఇండియా' అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ తెలిపారు.

వచ్చే పదేళ్లలో భారత మార్కెట్లో 60,000 కార్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని, ఇందుకోసం 2012 నాటికి అదనంగా మరో 70 కోట్ల రూపాయాలను పెట్టుబడులుగా వెచ్చించనున్నామని ఆయన తెలిపారు. జర్మనీ బిఎమ్‌డబ్ల్యూ కంపెనీకు చెందిన పూర్తి భారత అనుబంధ సంస్థ అయిన 'బిఎమ్‌డబ్ల్యూ ఇండియా' ఈ ఏడాది తమ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) "బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3"ని కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనిని పూర్తిగా జర్మనీ నుంచి విడిభాగాలు (సికెడి యూనిట్స్)గా దిగుమతి చేసుకొని చెన్నయ్‌లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో అసెంబ్లింగ్ చేయనున్నట్లు కంపెనీ వివరించింది.

More from DriveSpark

Article Published On: Saturday, March 26, 2011, 14:53 [IST]
English summary
BMW launches its luxury coup model car 6 Series in India, priced at Rs 95 lakh (ex-showroom). Currently BMW vehicles see a good number from the dealers in Kolhapur and Aurangabad. The company’s Chennai facility has been upgraded to yield 10000 units from the current 8000 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+