క్రాసోవర్ ఎస్‌యూవీ ఎక్స్3ను విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ

BMW X3
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో మరో కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టింది. సరికొత్త క్రాసోవర్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) "ఎక్స్3"ను రూ. 41.20 లక్షల ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)తో నేడు దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఇదే విభాగంలో ఆడి అందిస్తున్న క్యూ5 మరియు మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న జిఎల్‌కె వాహనాలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. గతేడాది జరిగిన ప్యారిస్ మోటార్ షోలో ఈ కొత్త తరం బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 కంపెనీ ఆవిష్కరించింది. ఈ వాహనాన్ని విడిభాగాలుగా భారత్‌కు దిగుమతి చేసుకొని కంపెనీ చెన్నయ్ ప్లాంటులో అసెంబ్లింగ్ చేయనుంది.

ఇది రెండు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. ఎక్స్3ఎక్స్‌డ్రైవ్20డి (X3xDrive20d) మరియు ఎక్స్3ఎక్స్‌డ్రైవ్30డి (X3xDrive30d) అనే వేరియంట్లలో కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 లభ్యం కానుంది. రెండో వేరియంట్ అయిన ఎక్స్3ఎక్స్‌డ్రైవ్30డి ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 47.90 లక్షలుగా ఉంది. కాగా... భారత మార్కెట్లో మొదటి వేరియంట్ (ఎక్స్3ఎక్స్‌డ్రైవ్20డి) డెలివరీలు ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ప్రారంభం కాగా.. రెండో వేరియంట్ (ఎక్స్3ఎక్స్‌డ్రైవ్30డి) డెలివరీలు అక్టోబర్ నెలలో జరగనున్నాయి. ఈ రెండు వేరియంట్లు కూడా ఎనిమిది ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతాయి.

More from DriveSpark

Article Published On: Thursday, August 25, 2011, 14:42 [IST]
English summary
German luxury carmaker BMW rolled out the much-awaited crossover SUV "BMW X3" on Indian roads with a price tag of Rs 41.20 lakh (ex showroom all India). The all-new SUV will compete in the segment with Audi Q5 and Mercedes-Benz GLK.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+