కస్టమర్ల చేత మనీ మనీ అనిపించనున్న మినీ కార్లు

BMW Mini
చూడటానికి ఇంచు మించు మారుతి సుజుకి స్విఫ్ట్, స్కొడా ఫ్యాబియా వంటి హ్యాచ్‌బ్యాక్ కార్ల లుక్‌ను పోలి ఉండే మినీ కార్లు (బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్) భారత్‌లో కొనుగోలుదారుల చేత మనీ బాబాయ్.. మనీ అనిపించనున్నాయి. కారు చిన్నగానే ఉంది కదా అని వీటి ధరలు కూడా తక్కువగా ఉంటాయనుకుంటే మనం కారులో కాలేసినట్లే.

మదేశంలో బిఎమ్‌డబ్ల్యూ మినీ బ్రాండ్ కార్ల ధరలు సాధారణ హ్యాచ్‌బ్యాక్ కార్ల ధరలో పోల్చుకుంటే దాదాపు ఐదు రెట్లు అధికం. భారత మార్కెట్లో సాధారణంగా హ్యాచ్‌బ్యాక్ కార్లు రూ. 5 లక్షల ధర నుండి ప్రారంభం అవుతుంటే, బిఎమ్‌డబ్ల్యూ మినీ బ్రాండ్ కార్లు మాత్రం రూ.25 లక్షల ధరతో ప్రారంభం కానున్నాయి.

బ్రిటన్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ చిన్న కార్లను రానున్న సంవత్సరం జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పో 2012లో విడుదల చేయనున్నట్లు బిఎమ్‌డబ్ల్యూ ప్రకటించింది. మరో రెండు నెలల్లో మినీ కార్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకోనున్నామని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా హెడ్ ఆండ్రియాస్ స్కాఫ్ తెలిపారు.

మినీ బ్రాండ్‌ కార్ల కోసం ప్రత్యేకంగా తొలుత ఢిల్లీ, ముంబైలలో రెండు షోరూమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నామని, 80 ఏళ్ల చరిత్ర మినీ బ్రాండ్‌లో కొత్త మినీ కారును పదేళ్ల క్రితమే అభివృద్ధి చేశామని, ఒక్క భారత్‌లోనే ఇంకా కారును ప్రవేశపెట్టలేదని ఆయన తెలిపారు. భారత్‌లో ప్రత్యేకించి మినీ బ్రాండ్ కార్ల కోసం 12 డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

మినీ బ్రాండ్‌లో వస్తున్న అన్ని మోడళ్లు.. కూపర్ మొదలుకొని, కంట్రీమ్యాన్, క్లబ్‌మ్యాన్ మరియు కాబ్రియో వరకూ భారత మార్కెట్లో లభ్యం కానున్నాయి. వాస్తవానికి 2009వ సంవత్సరంలోనే ఈ మినీ బ్రాండ్ కార్లను భారత్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ భావించింది. అయితే, భారత మార్కెట్లో మినీ బ్రాండ్ కార్లకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత వీటిని ఇక్కడి మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 18, 2011, 13:33 [IST]
English summary
BMW India has confirmed the launch of the iconic Mini cars in India sooner that we all expected. BMW India boss Andreas Schhaaf has said Mini cars will be imported within the next two months and two new showrooms for Mini will be established in Delhi and Bombay. The Cooper is expected to be priced around Rs.25 lakhs while the top end Club man will be priced about Rs.330 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+