భారత్‌లో అత్యధిక నెలవారీ విక్రయాలను ప్రకటించిన బిఎమ్‌డబ్ల్యూ

BMW
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ భారత కార్ మార్కట్లో ఇది వరకు ఎన్నడూ చూడనివిధంగా అత్యధిక నెలవారీ విక్రయాలను నమోదు చేసినట్లు ప్రకటించింది. భారత లగ్జరీ కార్ మార్కెట్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ మార్చి, 2011లో మొత్తం 1,027 కార్లను విక్రయించినట్లు తెలిపింది. విక్రయాలు జోరందుకోవండతో చెన్నయ్‌లో బిఎమ్‌డబ్ల్యూ అసెంబ్లింగ్ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే అంశాన్ని కంపెనీ పరిశీలించనుంది.

భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ డిమాండ్ ఉందని, మార్చి నెల విక్రయాల పట్ల తాను అంతగా సంతృప్తి చెందడం లేదని ఏప్రిల్ నెలలో మంచి విక్రయాలు సాధించగలమని అంచనా వేస్తున్నట్లు బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ వెల్లడించారు. మార్చి 2010లో కంపెనీ కేవలం 605 కార్లను మాత్రమే విక్రయిస్తే.. మార్చి 2011లో విక్రయాలు 69.75 శాతం వృద్ధిని సాధించి 1,027 కార్లను అమ్మగలిగామని ఆయన చెప్పారు.

బిఎమ్‌డబ్ల్యూ కార్లకు గిరాకీ పెరుగుతున్నందున ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ప్రస్తుతానికి తమ చెన్నయ్ ప్లాంటులో ఉత్పత్తి సమర్థవంతంగానే ఉందని అవసరమయితే సెకండ్ షిఫ్ట్ నడిపే అంశాలను వచ్చే నెలలో పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం చెన్నయ్‌లోని బిఎమ్‌డబ్ల్యూ ప్లాంటు సింగిల్ షిఫ్ట్ ద్వారా వార్షికంగా 10,000 కార్లను తయారు చేస్తుంది.

గత నెలలోనే బిఎమ్‌డబ్ల్యూ చెన్నయ్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాలీనా 8,000 యూనిట్ల నుంచి 10,000 యూనిట్లకు పెంచింది. కాగా.. బిఎమ్‌డబ్ల్యూ గట్టి పోటీదారులైన మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు కూడా మార్చి నెలలో అత్యధిక నెలవారీ విక్రయాలను నమోదు చేశాయి. మార్చి 2011లో మెర్సిడెస్ బెంజ్ విక్రయాలు 89.32 శాతం పెరిగి 833 కార్లు అమ్ముడు కాగా.. ఆడి విక్రయాలు మూడింతలకు పెరిగి 681 కార్లను విక్రయించింది.

More from DriveSpark

Article Published On: Friday, April 8, 2011, 9:58 [IST]
English summary
Indian luxury car market growing rapidly in 2011. German luxury carmaker BMW posts highest-ever monthly sales in India. BMW sold 1,027 cars in March, 2011. Meanwhile Mercedes-Benz India sold 833 units and Audi India sold 681 units in March.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+