లగ్జరీ కార్ల విక్రయాల్లో బీఎండబ్ల్యూ హ్యాట్రిక్‌

BMW
బిఎండబ్ల్యూ ఇండియా లగ్జరీ కార్ల విభాగంలో మూడవ సారి అత్యధిక విక్రయాలు సాగించి హ్యాట్రిక్‌గా నిలిచింది. 2010 సంవత్సరంలో అత్యధికంగా 6,426 కార్ల విక్రయాలతో వరుసగా మూడవసారి తన రికార్డు మైలురాయిని తానే అధికమించింది.బిఎండబ్ల్యూ ఇండియాలో నిబద్ధత గల సంస్థ అని, ఈ గ్రూపు మార్కెట్‌లో ఎన్నో నూతన రికార్డును సొంతం చేసుకుందని, భారతీయ లగ్జరీ కార్ల తయారీలో తన లీడర్‌షిప్‌ను కొనసాగిస్తునే నాణ్యత కలిగిన కార్ల తయారీ లక్ష్యంగా పనిచేస్తుందని బిఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్‌ అండ్రెస్‌ స్కూఫ్‌ అన్నారు.

ఈ కంపెనీ తన లక్ష్యాన్ని అధిక మించడంతో పాటు మార్కెట్‌ విస్తరణ, డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ విస్తరణ తదితర కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. బిఎండబ్ల్యూ తన లగ్జరీ కార్ల విభాగంలో ఉత్పత్తిని మిగతా సంస్థలకు దీటుగా నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా 6 సిరీస్‌లను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. త్వరలోనే ఎక్స్‌3 ఎస్‌యువిని ఈ సంవత్సరం మార్కెట్‌లోకి తీసుకురానుంది.మరోవైపు బిఎండబ్ల్యూ ఇండియాలో తన డీలర్‌షిప్‌ను విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా డీలర్‌షిప్‌లను 40కి పెంచాలని నిర్ణయించింది. దీన్ని నూతన నగరాలకు విస్తరించేం దుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 22, 2011, 16:38 [IST]
English summary
German luxury car maker BMW said it has increased capacity at its Chennai facility 8,000 units to 10,000 units per year, from the beginning of this month as it looks to meet increased demand and retain the number one position in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+