చెన్నై ప్లాంటులో 20,000వ కారును ఉత్పత్తి చేసిన బిఎమ్‌డబ్ల్యూ

BMW 20000th Car
ప్రస్తుతం భారతదేశపు ప్రథమ అగ్రగామి లగ్జరీ కార్ల తయారీ సంస్థగా అవతరించిన, జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా భారత్‌లో మరో మైలురాయిని అధిగమించింది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమిళనాడులోని శ్రీ పెరంబూర్ ప్లాంటులో అసెంబ్లిగ్ కార్యకలపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

సాలీనా 10,000 యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన ఈ ప్లాంటులో బిఎమ్‌డబ్ల్యూ ఇటీవలే 20,000 యూనిట్లను ఉత్పత్తిని చేసిన తన ఖాతాలో మరో మైలురాయిని నమోదు చేసుకుంది. ఈ ప్లాంటును ఏర్పాటు చేసి సుమారు నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ చెన్నై ప్లాంటులో 20,000వ కారు ఉత్పత్తిని మీడియాకు చూపిస్తున్న ప్లాంట్ మేనేజింగ్ డైరెక్టర్ జుర్గెన్ ఎడెర్‌ను పక్కచిత్రంలో గమనించవచ్చు.

మార్చి 2007లో ఈ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇదే ప్లాంటులో నవంబర్ 2010లో కంపెనీ తన 10,000వ కారును విడుదల చేసింది. ఈ ప్లాంట్ సింగిల్ షిఫ్ట్ ప్రకారం నడుస్తూ, సంవత్సరానికి 5,400 కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 400 ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ప్లాంట్ కోసం కంపెనీ రూ.110 కోట్లను పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది ఆరంభంలోనే ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని 10,000 యూనిట్లకు పెంచింది.

More from DriveSpark

Article Published On: Friday, December 16, 2011, 11:16 [IST]
English summary
German luxury carmaker BMW India is now in celebrations mood. Company has just rolled out its 20,000th car from Sriperumbudur plant in India. This achievement was happened nearly after 4 years of inauguration.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+