ఇంజన్‌లను ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తాం, ధరలు పెంచం: బిఎమ్‌డబ్ల్యూ

మెర్సిడెస్ బెంజ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ వంటి విదేశీ కంపెనీలు తమ కార్ల విడిభాగాలను భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడ అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తారు, ఈ వ్యాపారాన్ని సికెడి బిజినెస్ అంటాం. అసెంబ్లింగ్‌కు అవసరమైన ఇంజన్, ట్రాన్స్‌మిషిన్, గేర్‌బాక్స్‌లపై బడ్జెట్ 2011లో భారత ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 30 శాతానికి పెంచిందిం. అంతకు ముందు ఇది 10 శాతంగా ఉండేది. దీంతో ఇకపై అసెంబ్లింగ్‌కు ఇంజన్‌లను భారత్‌లో తయారు చేసుకుంటామని, అందువల్ల ఉత్పాదక వ్యయం తగ్గుతుందని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్, 5 సిరీస్ మరియు ఎస్‌యూవీ ఎక్స్1 మోడళ్లను భారత్‌లో అసెంబ్లింగ్ చేస్తుంది. ఈ సందర్భంగా బిఎమ్‌డబ్ల్యూ అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం త్త దిగుమతి సుంకం పెంచినా దాన్ని తమ వినియోగదారులపై రుద్దబోమని చెప్పారు.


Click it and Unblock the Notifications








