భారత్‌లో నంబర్ వన్ లగ్జరీ కారు 'మెర్సిడెస్ బెంజ్'

BMW
భారత లగ్జరీ కార్ల మార్కెట్లో గత రెండు ఏళ్లుగా తన హవాను కొనసాగిస్తూ వస్తున్న జర్మనీ ఆటో దిగ్గజం బిఎమ్‌డబ్ల్యు జనవరి, 2011 విక్రయాలలో 500 మార్కును తాకింది. అయితే తన సమీప పోటీదారు మెర్సిడెజ్‌ బెంజ్‌ ముందు మాత్రం జనవరి విక్రయాలలో బిఎమ్‌డబ్ల్యు ఓడిపోయింది. మెర్సిడెస్ బెంజ్‌ జనవరి నెలలో 640 యూనిట్లు విక్రయిస్తే.. బిఎమ్‌డబ్ల్యు 500 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. గతేడాదితో పోలిస్తే బిఎమ్‌డబ్ల్యు విక్రయాలు 46.63 శాతం వృద్ధి చెందాయి. జనవరి 2010లో బిఎమ్‌డబ్ల్యు కేవలం 341 కార్లను మాత్రమే విక్రయించింది. అలాగే బెంజ్ కూడా గతేడాదితో పోలిస్తే.. 58.81 శాతం వృద్ధిని సాధించి 640 యూనిట్లు విక్రయించింది.

లగ్జరీ కార్ మార్కెట్లో గట్టి పోటీ ఇస్తున్న ఆడి ఇండియా కూడా ఈ ఏడాది జనవరి విక్రయాలలో 56.86 శాతం వృద్ధిని సాధించి 480 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో ఆడి విక్రయాలు 306 యూనిట్లుగా ఉన్నాయి. అయితే విక్రయాల విషయానికి వస్తే.. మెర్సిడెజ్‌ బెంజ్‌, ఆడి కంపెనీల కన్నా బిఎమ్‌డబ్ల్యు విక్రయాలే అధికంగా ఉన్నాయి. 2010 సంవత్సరంలో బిఎమ్‌డబ్ల్యు 6,246 యూనిట్లు విక్రయించి లగ్జరీ కార్ సెగ్మెంట్‌లో అగ్రభాగాన నిలువగా.. మెర్సిడెజ్‌బెంజ్‌ 5,819 యూనిట్లను, ఆడి 3,003 యూనిట్లు విక్రయించింది. ఈ ఏడాది చివరి నాటికి భారత్ లగ్జరీ కార్ మార్కెట్లో దాదాపు 15,000 విలాసవంతమైన కార్లు అమ్ముడవుతాయని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, February 10, 2011, 16:37 [IST]
English summary
Germany's luxury car maker BMW reaches 500 unit mark in January, 2011 sales, which is less by 140 units than that of rival Mercedes-Benz. BMW registered a jump of 46.63% over 341 units sold during the corresponding month last year, the company said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+