ఈ దీపావళి స్విఫ్ట్ బుక్ చేసుకుంటే.. వచ్చే దీపావళికి డెలివరీ..

కొత్త స్విఫ్ట్ ఉత్పత్తి స్థాయికి మించి బుకింగ్‌లు రావడంతో ఈ కారు డెలివరీ కోసం వెయింట్ పీరియడ్ కూడా అంతకంతా పెరిగిపోతూనే ఉంది. దీనికితోడు మానేసర్ ప్లాంటులో కార్మిక సమస్య కారణంగా దీని ఉత్పత్తి కూడా నత్తనడకన సాగుతోంది. గడచిన రెండు నెలల క్రితం కొత్త స్విఫ్ట్ కోసం 3-6 నెలల వెయింటి పీరియడ్ ఉండగా ఇప్పుడు అది 8-12 నెలలకు ఎగబాకింది.
మా వన్ఇండియా ప్రతినిధి ఒకరు కొత్త స్విఫ్ట్ గురించి విచారించడం కోసం బెంగుళూరులోని ఓ స్థానిక డీలర్ వద్దకు వెళ్లగా, ఆ షోరూమ్ ప్రతినిధి పాత స్విఫ్ట్‌కు కొత్త స్విఫ్ట్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం, కొత్త స్విఫ్ట్‌లో ఉన్న అత్యాధునిక ఫీచర్లు, ధరలు మొదలగు వాటి గురించి చక్కగా పూర్తి సమాచారాన్ని అందించాడు.
అంతా బాగానే ఉంది కానీ, డెలివరీ పీరియడ్ గురించి అడిగే సరికి, సదరు షోరూమ్ ప్రతినిధి ముఖం అదోలా పెట్టుకొని, మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో కార్మికుల సమ్మె కారణంగా స్విఫ్ట్ ఉత్పత్తి తగ్గిందని, మీరు ఈ దీపావళి కారును బుక్ చేసుకుంటే వచ్చే దీపావళి నాటికి డెలివరీ పొందవచ్చని షాకిచ్చే సమాధానం చెప్పాడు.
ఏదేమైనప్పటికీ.. గత 14 రోజులగా మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో జరుగుతున్న సమ్మె ముగిసింది. మరో రెండు మూడు రోజుల్లో మానేసర్ ప్లాంటులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్ తగ్గవచ్చనే ఆశాభావం ఇటు డీలర్లలోనూ అటు కొనుగోలుదారులలోనూ నెలకొంది.


Click it and Unblock the Notifications








