మా మార్కెట్లోకి టాటా నానోను స్వాగతిస్తున్నాం: బ్రెజిల్

Tata Nano Brazil
ప్రపంచంలో అత్యంత చౌక కారుగా రికార్డు సృష్టించిన టాటా మోటార్స్ ప్రజల కారు 'టాటా నానో' బ్రెజిల్ వాసులకు తెగ నచ్చేసిందట. మనదేశంలోని చిన్న కారు విభాగంలో నెలకొన్న విపరీతమైన పోటీ కారణంగా, ఇక్కడి మార్కెట్లో అంతంత మాత్రంగా నెట్టుకొస్తున్న ఈ బుజ్జి కారును తమ దేశానికి సాదరంగా ఆహ్వానిస్తున్నామని బ్రెజిల్‌లో రెండవ ముఖ్య రాష్ట్రమైన మినాస్‌ గెరాయిస్‌ గవర్నర్‌ ఆంటోనియో అగస్టో అనస్తాసియా వ్యాఖ్యానించారు.

బ్రెజిల్‌లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో మినాస్‌ గెరాయిస్‌ కూడా ఒకటి. ఎనిమిది రోజుల భారత పర్యటన నిమిత్తం మన దేశానికి వచ్చిన ఆయన ముంబైలో టాటా సంస్థల చైర్మన్‌ రతన్‌ టాటాను కలిసి ఈ విషయమై చర్చించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సిఐఐ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టాటా నానో కారు పట్ల బ్రెజిల్‌ వాసులు మంచి ఆసక్తిని కనబరుస్తున్నారని చెప్పారు.

కాగా.. టాటా మోటార్స్ ఇప్పటికే తమ నానో కారును శ్రీలంక, నేపాల్ దేశాలకు కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియూ) రూట్లో ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా మరికొద్ది రోజుల్లో మయన్మార్‌ దేశానికి కూడా టాటా నానో కారును ఎగుమతి చేయాలని, అలాగే విదేశాలకు టాటా నానోను విడి భాగాలుగా దిగుమతి చేసుకొని కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్ (సికెడి) రూట్లో అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 15, 2011, 12:56 [IST]
English summary
Ratan Tata's dream car Tata Nano atteacted Brazil Government. Brazil expressed interest in taking the world's cheapest car Tata Nano to the South American nation. Governor of Minas Gerais, the second most populous state of Brazil, Antonio Augusto Anastasia, who is here on 8-day visit to India, said he recently met Ratan Tata in Mumbai.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+