బుల్లెట్-ఫ్రూఫ్ సఫారీ కారును ప్రవేశపెట్టిన టాటా మోటార్స్

అంటే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాధారణ సఫారీ (భారత్ స్టేజ్-4 సఫారీ డికార్ ఎల్ఎక్స్)తో పోలిస్తే దీని ధర ఏడు రెట్లకు మించి ఉంటుంది. సఫారీ డికార్ ఎల్ఎక్స్ ధర దాదాపు 8 లక్షలుగా ఉంది (ఎక్స్-షోరూమ్ ముంబై). టాటా సఫారీ నేరుగా తయారీదారు నుంచి అందుబాటులో ఉంటుంది. ఇది చూడటానికి అచ్చూ సాధారణ సఫారీలానే ఉంటుంది. బుల్లెట్-ప్రూఫ్ సఫారీను ఎన్ఐజె లెవల్ 3/బి6 ప్రొటెక్షన్‌తో ఖాలీ టైర్ల (ఫ్లాట్ టైర్స్)పై కూడా 50-60 కిలోమీటర్ల వేగంతో దాదాపు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
కారు అద్దాలను, ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా బుల్లెట్-ప్రూఫ్‌తో తయారు చేశారు. కారు ట్యాంక్ సమీపంలో హ్యాండ్ గ్రనేడ్ పేలినా కారు పేలిపోవడం జరగదని, కారులో లోపలి వ్యక్తులకు కూడా ఎలాంటి హాని సంభవించదని కంపెనీ పేర్కొంది. ఇంకా ఈ కారు లోపలి సీట్లను స్పోర్ట్ ప్లష్ లెథర్‌తో తయారు. ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. దీని ధర ఎక్కువగా ఉండటంతో చాలా కొద్ది మంది డీలర్లు మాత్రమే ఈ కారును కొనుగోలు చేసి తమ షోరూమ్‌లలో ప్రదర్శనకు ఉంచుతున్నారని టాటా మోటార్స్ డీలర్ ఒకరు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








