మార్చి 9 నుంచి బస్ అండ్ స్పెషల్ వెహికిల్ ఎక్స్‌పో

ఈ బస్ అండ్ స్పెషల్ వెహికిల్ ఎక్స్‌పో 2011లో ఆటోమొబైల్ పరిశ్రమలోని పలు ప్రముఖ కంపెనీలు.. తాము రూపొందించిన కొత్త ఉత్పాదనలు, లగ్జరీ కోచ్‌లు, న్యూ రేంజ్ బస్సులు, మొబైల్ క్లాస్‌రూమ్, హైబ్రిడ్ వేరియంట్లను ప్రదర్శించనున్నారు. టాటా మోటార్స్ తయారు చేసిన హైబ్రిడ్ బస్ బిఎస్‌విఈ 2011ను ఇక్కడ తొలిసారిగా ప్రదర్శించనుందని, 30 విద్యార్ధులకు పాఠ్యాంశాలు బోధించే ఎల్‌సీడీ ప్రొజక్టర్‌తో కూడిన బస్ ప్రత్యేక ఆకర్షణ కాగలదని సిఐఐ తెలిపింది. ఇంకా వోల్వో, ఎస్‌ఎమ్ఎల్ ఇసుజు, మహీంద్రా నావీస్టార్, ఫోర్స్ మోటార్స్, అలిసన్ ట్రాన్స్‌మిషన్, ఫైర్‌స్టోన్, టివిఎస్, చైన్ ఎఫ్‌ఎడబ్ల్యు గ్రూప్ తదితర సంస్థలు తమ ఉత్పత్తులను ఈ షోలో ప్రదర్శించనున్నాయి.


Click it and Unblock the Notifications








