కేవలం రూ. 2.69 లక్షలకే జిఎమ్ చిన్న కారు చెవర్లే స్పార్క్

Chevrolet Spark
భారత్‌లో కార్ల ధరలను భారీగా తగ్గించడంలో ఇప్పటి వరకూ జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం హోండా మోటార్సే టాప్ అనుకుంటుంటే.. ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ తనే టాప్ అనేపించుకుంది. జనరల్ మోటార్స్ భారత్‌లో చెవర్లే బ్రాండ్‌లో అందిస్తున్న చవకైన చిన్న కారు స్పార్క్ ఇప్పుడు మరింత చౌక ధరకే లభ్యం కానుంది.

గతంలో స్పార్క్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.54 లక్షలుగా ఉండేది. కానీ మందగించిన విక్రయాలను మరియు పండగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ మోడల్లో ఎంట్రీలెవల్ వేరియంట్‌పై ఏకంగా రూ.85,000 తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అది కూడా పరిమిత కాలం మాత్రమే. ఈ మేరకు జనరల్ మోటార్స్ టెలివిజన్‌లో వాణిజ్య ప్రకటనలు కూడా ఇచ్చి వినియోగదారులను ఆకర్షిస్తోంది.

గతంలో హోండా మోటార్స్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ సెడాన్ సిటీపై ఏకంగా రూ.66,000 డిస్కౌంట్‌ను ప్రకటించి మార్కట్లో ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ఆ వెంటనే తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు హోండా జాజ్‌పై సుమారు రూ.1,75,000 డిస్కౌంట్‌తో మరో సంచలనానికి తెరలేపింది. ఆ తర్వాత తక్కువ ధరకే (రూ. 5.5 లక్షలు) సరికొత్త హోండా జాజ్‌ను కూడా విడుదల చేసింది.

చెవర్లే స్పార్క్ సమీప పోటీదారు మోడల్ అయిన మారుతి సుజుకి ఆల్టో వేగానికి బ్రేక్ వేసేందుకు జనరల్ మోటార్స్ ఈ డిస్కౌంట్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక చిన్న కారు స్పార్క్ విషయానికి వస్తే.. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉండేవారికి ఇది చక్కగా సరిపోతుంది. విశాలమైన స్పేస్, అందమైన లుక్ మరియు శక్తివంతమైన ఇంజన్‌తో ఇది లీటరుకు 15-18 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 3, 2011, 17:33 [IST]
English summary
Chevrolet has slashed the price of the Spark small car to just Rs.2.69 lakhs. The carmaker has gone on a marketing onslaught on electronic as well as print media to attract customers. Chevrolet's entry level car has lost some sheen after the launch of the new Beat which is now available with both diesel and petrol engines.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+