2015 నాల్గవ అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఎదగనున్న భారత్

2020లో భారత్ వార్షికంగా 60 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని సంపాదించుకోగలదని సదరు కంపెనీ అంచనా వేసింది. అలాగే 2025లో అమెరికా, చైనా దేశాలు ఆటోమొబైల్ రంగంలో కీలక పాత్రను పోషించనున్నాయని, ఆ సమయానికి ఈ రెండు దేశాలు మొత్తం ప్రపంచ కార్ మార్కెట్లో 80 శాతం మార్కెట్ వాటాతో ఆటో మార్కెట్లో ప్రపంచ లీడర్లుగా నిలుస్తాయని ఆ సర్వే తెలిపింది.
ప్రస్తుతం భారత్‌లో ఎ అండ్ బి సెగ్మెంట్ కార్ల కొరత ఉందని, కానీ సమీప భవిష్యత్తులో భారత్ ఈ కొరతను అధిగమించి ప్రపంచ మార్కెట్‌కు వాహనాలను ఎగుమతి చేయగలదని, అలాగే చైనా విషయానికి వస్తే.. అమెరికా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని సి అండ్ డి సెగ్మెంట్ వాహనాలను ఉత్పత్తి చేయగలదని ఆ సర్వే పేర్కొంది. భారత మార్కెట్లో ఇదే కనుక జరిగితే ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్న పలు విదేశీ కంపెనీల స్థాయి దిగజారిపోవచ్చునని ఆ సర్వేలో తేలింది.
ఫలితంగా ఇప్పటికే విదేశీ కంపెనీలైన వోల్క్స్‌వ్యాగన్, హ్యుందాయ్, ఫోర్డ్, టొయోటా వంటి కంపెనీల ప్రభావం తగ్గి ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 50 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉన్న మారుతిపై ప్రభావం చూపనుంది. కాబట్టిని ఈ పోటీ తట్టుకోవాలంటే ప్రపంచ కంపెనీలు భారత్‌లో తమ ప్లాంట్ల సామర్ధ్యాన్ని పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో విదేశీ కంపెనీలు భారత్‌లో ఏటా 200 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులను వెచ్చించవచ్చునని ఆ కంపెనీ అంచనా వేస్తుంది.


Click it and Unblock the Notifications








