మరో రెండేళ్ళలో చెవర్లెట్ కాడిలాక్: జనరల్ మోటార్స్

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఉత్పత్తులలో చెవర్లెట్ బ్రాండ్ పేరిట భారత్‌లో 8 వేరియంట్లు లభ్యమవుతున్నాయి. స్పార్క్, ఏవియో యూవీఏ, ఏవియో, ఓప్ట్రా, తవేరా, కాప్టివా, క్రూజ్‌లతో పాటు తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన కాంపాక్ట్ కారు బీట్‌లు వినియోగదారులను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయి.
ప్రస్తుతం భారత్‌లో ప్రతి ఎనిమిది సెకన్లకూ ఒక జనరల్ మోటార్స్ కారు అమ్ముడవుతోందని, అభివృద్ధి చెందుతున్న భారత్‌లో లగ్జరీ కార్ల మార్కెట్ గణనీయంగా పెరుగుతోందని అందువల్లే ప్రీమియం బ్రాండ్ కాడిలాక్‌ను తీసుకురావాలని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 1902లో కాడిలాక్ బ్రాండ్ పేరిట తొలి కారును ఆవిష్కరించగా, ప్రస్తుతం 39 దేశాల్లో ఈ కారు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ. 60-70 లక్షల మేర ఉండవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








