సునామీ తర్వాత ప్లాంట్లను పునఃప్రారంభించిన ఆటో కంపెనీలు

Cars In Tsunami
ఇటీవల జపాన్‌లో సంభవించిన భీకర ప్రకృతి భీభత్సం తర్వాత ఆటోమొబైల్ కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మెల్లిగా పునఃప్రారంభిండం జరుగుతోంది. జపాన్ ఆటో దిగ్గజాలుగా ఉన్న టొయోటా, నిస్సాన్, మిత్సుబిషి వంటి పలు సంస్థలు తమ తమ ప్లాంట్లలో పనులు తిరిగి కొనసాగిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో కాకుండా.. తొలుత పాక్షికంగా పనులు ప్రారభించారు. ఈ కంపెనీలకు విడిభాగాలు అందజేసే వివిధ కంపెనీలు పూర్తిగా సునామీలో తుడిచిపెట్టుకుపోవడంతో ఆ ప్రభావం కంపెనీ ఉత్పత్తిపై పడే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ అంతరాయం కూడా ఆటోమొబైల్ కంపెనీలకు ప్రధాన సమస్యగా పరిణమించనుంది.

జపాన్‌లో కంపెనీలు మూతపడటంతో వివిధ దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాటి అనుబంధ సంస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా భారత్‌లో ఉన్న జపాన్ అనుబంధ సంస్థలైన మారుతి సుజుకి, టొయోటా కిర్లోస్కర్, హోండా సియోల్ వంటి వివిధ కంపెనీలపై ఈ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. ఈ నెల 11న మూతపడిన ప్లాంట్లలో ఏడింటిని కంపెనీ తాజాగా రీఓపెన్ చేసినట్లు టొయోటా పేర్కొంది.

కాగా.. ఇతర 22 ప్లాంట్లపై మార్చి 22న ఓ నిర్ణయం తీసుకోనుంది. అలాగే నిస్సాన్ మరియు వాటి అనుబంధ సంస్థలు ఒక్కొక్కటిగా తమ ప్లాంటను రీఓపెన్ చేస్తున్నాయి. ఇతర ఆటో దిగ్గజాలు హోండా మోటార్ కార్పోరేషన్, సుజుకి మోటార్ కార్పోరేషన్‌లు మాత్రం ఇంకా ప్లాంట్లను రీఓపెన్ చేయలేదు. మార్చి 20 వరకూ తమ ప్లాంట్లు మూసివేయబడి ఉంటాయని హోండా, మజ్దా కంపెనీలు పేర్కొన్నాయి. ఈ విషయంపై ఈ ఆదివారం ఆటో కంపెనీలు ఓ నిర్ణయం తీసుకోనున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, March 18, 2011, 17:40 [IST]
English summary
The tragic turmoil out of the recent earthquake and tsunami has had a devastating impact on the lives of Japan. Now a sigh of relief has come to the business houses in automotive sector as Toyota, Nissan and Mitsubishi have resumed their least work in t heir plants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+