బెంజ్ కారును కొనలేరా..? అయితే లీజుకు తీసుకోండి..

మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ అయిన డైమ్లర్ ఏజి మంగళవారం భారత్‌లో ఆర్థిక సేవల విభగాన్ని ప్రారంభించిన సగంతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రకాల ఫైనాన్స్ సేవలను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అందులో భాగంగానే అమెరికా వంటి పశ్చాత్య దేశాలలో విజయవంతమైన కార్ లీజింగ్ విధానాన్ని భారత్‌లో కూడా కంపెనీ అందించనుంది. "అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వ్యక్తిగత లీజ్ ఎంతగానో విజయవంతమైంది. అమెరికాలో 40 శాతం వ్యక్తిగత అమ్మకాలు లీజింగ్ విధానం ద్వారా జరుగుతుంటే, కేవలం 150 శాతం అమ్మకాలు మాత్రమే ఫైనాన్స్ ద్వారా జరుగుతున్నాయి.
భారత్‌లో కూడా ఈ విధానానికి మంచి స్పందన లభించిగలదని ఆశిస్తున్నామ"ని డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజి మేనేజ్‌మెంట్ బోర్డ్ చైర్మన్ క్లాస్ ఎన్టెన్‌మ్యాన్న్ తెలిపారు. కారు మొత్తం ధరలో సగం ధరను చెల్లించి మిగిలిన ధరను వాయిదాల వారీగా చెల్లించుకునే సౌకర్యాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది. అలాకాకుండా.. సగం ధరను చెల్లించి మూడేళ్లపాటు బెంజ్ కారును లీజుకు తీసుకునే సదుపాయం కూడా ఉంది. లీజింగ్ విధానంలో కారు మెయింటినెన్స్ మరియు ఇన్సూరెన్స్‌లను కంపెనీయే భరిస్తుంది.


Click it and Unblock the Notifications








