మార్చి మెగా ఆఫర్స్.. కొత్త కార్లపై భారీ డిస్కౌంట్స్..!

Maruti-Alto K10
కొత్త కారు కొనాలనుకునే వారికి మార్చి నెలలో మెగా ఆఫర్లు లభించనున్నాయి. ఇప్పటికే పలు దేశీయ విదేశీయ కంపెనీలు తాము అందిస్తున్న వివిధ రకాల మోడళ్లపై భారీ నగదు డిస్కౌంట్లను వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా మోటార్ వంటి పలు కంపెనీలు గతేడాది డిసెంబర్ కన్నా మెరుగైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎంపిక చేసిన మోడళ్లపై మారుతి సుజుకి రూ. 40,000 వరకూ డిస్కౌంట్‌ను ప్రకటిస్తుండగా.. హ్యుందాయ్ రూ. 45,000 వరకూ, హోండా 55,000 వరకూ తగ్గింపులను ప్రకటిస్తున్నట్లు డీలర్లు వెల్లడించారు.

సాధారణంగా ప్రతి ఏటా మార్చి నెలాఖరు నాటికి వార్షిక స్టాక్ రిజిష్టర్లను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టాక్‌ను తగ్గించుకునేందుకు కంపెనీలు, డీలర్లు ఈ విధమైన ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ప్రస్తుతం అందిస్తుంన్న డిస్కౌంట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదివరకు ఎన్నడూ ఇవ్వలేదని డిల్లీకు చెందిన ఓ మారుతి సుజుకి డీలర్ చెప్పారు. ఆల్టో కె10పై రూ. 30,000, ఏ-స్టార్, వ్యాగన్ఆర్‌ మోడళ్లపై రూ. 35,000, ఎస్ఎక్స్4 సెడాన్ కారుపై అధికంగా రూ. 40,000 తగ్గింపును అందిస్తున్నట్లు సదరు డీలర్ వెల్లడించారు.

కార్ల కంపెనీలు హఠాత్తుగా వినియోగదారులపై ఇంత ప్రేమ చూపించడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. అందులో మొదటిది కేంద్ర బడ్జెట్ 2011లో ఎక్సైజ్ సుంకాన్ని పెంచవచ్చనే భయంతో ఆటోమొబైల్ తయారీదారులు తమ డీలర్ల వద్ద అధికంగా స్టాక్‌ను స్టోర్ చేయడం జరిగింది. మరోవైపు ఈ నెలాఖరుతో 2010-11 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2010 నుంచి మార్చి 2011 వరకూ) కూడా ముగియనుండటంతో తమ అమ్మకాల లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ కంపెనీలు పోటాపోటీగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, March 14, 2011, 14:54 [IST]
English summary
Car companies are offering huge discounts in this March, in view of clear their stocks by this month end as the finacial year cloasing. Companies like country's largest carmaker Maruti Suzuki, Second biggest carmaker Hyundai Motor and Honda Motor are now offering even better discounts and incentives than in December 2010.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+