దేశీయ అమ్మకాలు ఢమాల్.. విదేశీ అమ్మకాలు జిగేల్..

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - ఆగస్టు కాలానికి కార్ల ఎగమతులు 2,17,409 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో వీటి సంఖ్య 1,77,634 యూనిట్లుగా ఉన్నట్లు ఎస్ఏఎమ్ తెలిపింది. ప్రధానంగా భారత మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన నిస్సాన్ కంపెనీ ఎగుమతులు జోరందుకోవడంతో ఎగుమతులు పెరిగాయి. ఈ సమయంలో ఫోర్డ్ ఇండియా కూడా ప్రోత్సాహకర పనితనాన్ని చూపి విదేశీ అమ్మకాలను మూడు రెట్లకు పెంచుకుంది.
ఏప్రిల్-ఆగస్టు 2011 కాలం నిస్సాన్ 42,540 మైక్రా కార్లను యూరప్‌కు ఎగుమతి చేసింది. కాగా.. ఫోర్డ్ చిన్న కారు ఫిగో 10,118 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది ఇదే కాలానికి ఇవి 3,168 యూనిట్లుగా ఉన్నాయి. హ్యూందాయ్ మోటార్ 1,07,572 యూనిట్లను, మారుతి సుజుకి 53,362 యూనిట్లను, టాటా మోటార్స్ 2,806 యూనిట్లను ఎగుమతి చేశాయి.


Click it and Unblock the Notifications








