దేశీయ మార్కెట్ల కన్నా అంతర్జాతీయ మార్కెట్లే భేష్..!!

కాగా.. దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 16 శాతం క్షీణించి ఏకంగా మూడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. నవంబర్ 2008 తర్వాత నెలవారీ అమ్మకాలు ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి. గడచిన జులై నెలలో దేశీయ కార్ల అమ్మకాలు 15.76 శాతం పడిపోయి గతేడాది ఇదే నెలతో పోలిస్తే 1,58,767 యూనిట్ల నుంచి 1,33,747 యూనిట్లకు తగ్గాయి. ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతూ వస్తున్న వడ్డీరేట్లు, ఇంధన ధరలు భారత ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాలను చూపాయి, ఫలితంగా ఆటో మార్కెట్ సెంటిమెంట్ కూడా బలహీనపడిందని మాథూర్ అన్నారు.
జూలైలో మారుతి సుజుకి దేశీయ కార్ల అమ్మకాలు 31% క్షీణించి 52,483 యూనిట్లుగా ఉండగా, హ్యూండయ్ అమ్మకాలు 11.49 శాతం, టాటా మోటార్స్ అమ్మకాలు 43.13 శాతం క్షీణించాయి. అయితే, ఎగుమతుల విషయానికి వచ్చే సరికి దేశీయ ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఎగుమతులు 11 శాతం వృద్ధి చెంది 24,025కు చేరగా, ప్రథమ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎగుమతులు మాత్రం 18 శాతం క్షీణించాయి. జూన్ నెలలో మారుతి మానేసర్ ప్లాంటులో వరుసగా 13 రోజుల పాటు జరిగిన సమ్మె కంపెనీ ఉత్పత్తిపై ప్రభావం చూపింది.


Click it and Unblock the Notifications








