కార్ల దిగుమతి కుంభకోణం: యూపిఏ మంత్రి కుమార్తెపై విచారణ

Car Import Scam
గత మే నెలలో వెలుగు చూసిన కార్ల దిగుమతి కుంభకోణంలో మహారాష్ట్రలోని యూపిఏకు చెందిన ఓ మంత్రి కుమార్తెను డిఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. గత మే నెలలో బయటపడిన కార్ల దిగుమతి కుంభకోణంలో తవ్విన కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. ఈ స్కామ్‌లో రాజకీయనాయకులు, ప్రముఖులు, క్రికెటర్లు వంటి హైప్రొఫైల్ కలిగిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు డైరక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే.

యూరప్‌ వంటి దేశాల నుంచి దొంగిలించిన లగ్జరీ కార్లు, లేదా అక్రమంగా నకిలీ బిల్లులతో దిగుమతి చేసుకున్న కార్లు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఈ కేసులో ఢిల్లీకు చెందిన ఓ హై ప్రొఫైల్ ఆటో వర్క్‌షాప్ యజమాని సుమిత్ వాలియాను అధికారులు అరెస్టు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం.. మహారాష్ట్ర యూపిఏ మంత్రి కుమార్తె ఒక ఆడి, ఒక పోర్షే మరియు ఒక బిఎమ్‌డబ్ల్యూ కార్లను నకిలీ ఇన్వాయిస్‌తో సుమిత్ వాలియా సేవలను ఉపయోగించుకొని దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.

ఈ కేసులో అడ్డంగా బుక్ అయిన అమిత్ వాలియా ద్వారా కార్లను కొనుగోలు/దిగుమతి చేసుకున్న హైప్రొఫైల్ వినియోగదారుల జాబితాను అధికారులు సంపాధించగలిగారు. దీని ద్వారా ఒక్కొక్కరినీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా.. ఈ స్కామ్‌లో తొలుతగా విచారణ ఎదుర్కోనున్న వ్యక్తి మాహారాష్ట్రలో అత్యంత శక్తివంతమైన మంత్రి కుమార్తె కావడం గమనార్హం. అయితే, సదరు యూపిఏ మంత్రి మరియు అతని కుమార్తె పేర్లు, తదితర వివరాలను మాత్రం ఆ పత్రిక వెల్లడించలేదు.

గడచిన రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఫెరారీ, రోల్స్ రాయిస్, హమ్మర్స్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్, పోర్షే మరియు లాంబోర్గినీ వంటి పలు లగ్జరీ కార్లను దాదాపు 45 వరకూ డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, July 18, 2011, 14:44 [IST]
English summary
The luxury car scam headed by Sumit Walia from Delhi is heading towards its first high profile victim. Newspaper reports have said a daughter of a union minister in the UPA government from Maharashtra has purchased a Porsche, a BMW and a Audi car from Mr Walia. The Directorate of Revenue Intelligence officials will be questioning her shortly. The DRI has already seized several luxury cars including Ferrari, Bentley, Aston Martin and Rolls-Royce.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+