డిస్కౌంట్లు, స్కీమ్‌లతో కస్టమర్లను ఆకట్టుకోనున్న కార్ల కంపెనీలు

Car Loans
రానున్న నెలల నుంచి ఆటోమొబైల్ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లను, స్కీమ్‌లను ప్రకటించనున్నాయి. పెరిగిన పెట్రోల్, వడ్డీ రేట్ల కారణంగా చప్పబడిన కార్ల అమ్మకాలకు తిరిగి ఊతమిచ్చేందుకు జూన్ నెల నుంచి వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టేందుకు వాహన తయారీదారులు సన్నాహాలు చేస్తున్నారు. గత నెలలో కార్ల విక్రయాలు దాదాపు 10 శాతానికి పడిపోవడం, అలాగే ఈ నెలలో విక్రయాలు మందగించడాన్ని దృష్టిలో ఉంచుకొని ఆటో కంపెనీలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి.

విక్రయాలను పెంచుకోవాలంటే డిస్కౌంట్ ప్యాకేజీలను ఆఫర్ చేయడమే ఉత్తతమైన మార్గమని దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) అభిప్రాయపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో డిస్కౌంట్లు చక్కగా పనిచేస్తాయని, వరుసగా రెండు నెలల పాటు తగ్గిన విక్రయాలను దృష్టిలో ఉంచుకొని జూన్ నెలలో డిస్కౌంట్లను ప్రకటించాలనే ప్రతిపాదనలు తీసుకువస్తున్నామని ఢిల్లీలోని మారుతి డీలర్ ఒకరు వెల్లడించారు. కార్ల కంపెనీలు దాదాపు రూ. 60,000 వరకూ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించే అకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, May 30, 2011, 18:14 [IST]
English summary
Automakers are planing to offer a wide range of discounts on new models from June to recover the slowdown sales from past two months, which are triggered by rising fuel prices and interest rates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+