రికార్డు స్థాయిలో నమోదైన వాహన విక్రయాలు: కార్లే టాప్..!!

అంతేకాకుండా.. ప్రపంచపు రెండవ అచతిపెద్ద ఆటో మార్కెట్ అయిన అమెరికా కూడా నాలుగేళ్ల సుధీర్ఘ ఆర్థిక మాంద్యం తర్వాత మెల్లిగా కోలుకోవడం మొదలుపెట్టింది. 2010లో అగ్రరాజ్య మార్కెట్ 11 శాతం వృద్ధిని సాధించింది. ఇక ప్రపంచపు మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన భారత ఆటో మార్కెట్ కూడా 2010లో 9 శాతం వృద్ధిని కనబరిచింది. ముఖ్యంగా దేశీయ డిమాండ్ పెరగడంతో ఈ వృద్ధి నమోదైంది. జనవరి, 2011లో మొత్తం వాహన విక్రయాలు 26.3 శాతం వృద్ధిని కనబరిచి 1,84,332 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇక కంపెనీల విషయానికి వస్తే.. భారత ఆటో దిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) ఈ ఏడాది జనవరి విక్రయాలలో 14.7 శాతం వృద్ధిని కనబరిచింది. జనవరి నెలలో మారుతి వాహన ధరలను పెంచడంతో దాని ప్రభావం విక్రయాలపై పడినట్లు తెలుస్తుంది. గతేడాది మార్చి తర్వాత మారుతి విక్రయాలు ఇంత తక్కువగా నమోదవ్వడం ఇదే మొదటిసారి. అలాగే టాటా మోటార్స్ కూడా నానో కారును విక్రయించడానికి ప్రవేశపెట్టిన పలు పథకాలు బాగానే పనిచేశాయి. ఫలితంగా జనవరి నెలలో కంపెనీ 15 శాతం వృద్ధిని సాధించింది.
గత సంవత్సరంలో వివిధ రుణ సంస్థలు వడ్డీ రేట్లను భారీగా పెంచడంతో దాని ప్రభావం ఆటో పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వడ్డీ రేట్ల సవరింపు ఫలితంగా ఆటోమొబైల్ రంగం, రియాల్టీ రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి. అయితే మరికొద్ది రోజుల్లో బడ్జెట్ 2011 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం మరోసారి వడ్డీ రేట్లను సవరించినా లేదా ఎక్సైజ్ సుంకాన్ని పెంచినా.. దేశీయ ఆటో రంగం జోరుకు బ్రేక్‌లు పడే అవకాశం ఉందని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం రెండు శాతం మేర ఎక్సైజ్ సుంకాన్ని పెంచే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత ఆటో మార్కెట్ ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతుందో కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications








