కార్ల విక్రయాలలో 24%, బైకుల విక్రయాలలో 19% వృద్ధి

భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం... దేశీయ మోటార్‌సైకిల్ విక్రయాలు 18.72 శాతం వృద్ధితో 8,40,941 యూనిట్లను అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో మోటార్‌సైకిల్ విక్రయాలు 7,08,369 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 19.14 శాతం వృద్ధి చెంది 10,96,233 యూనిట్లుగా ఉంటే అంతకు ముందు సంవత్సరంలో ఇవి 9,20,154 యూనిట్లుగా ఉన్నాయి.
ఇకపోతే.. వాణిజ్య వాహణ విభాగంలో విక్రయాలు 15.35 శాతం వృద్ధితో 77,688 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరంలో ఇవి 67,352 యూనిట్లుగా ఉన్నట్లు ఎస్ఐఏఎమ్ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అన్ని విభాగాలను కలిపి చూస్తే మార్చి, 2011లో మొత్తం భారత వాహన విక్రయాలు 19.42 శాతం వృద్ధిని నమోదు చేసి 14,65,909 యూనిట్లుగా ఉంటే.. మార్చి, 2010లో 12,27,511 యూనిట్లుగా నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications








