కార్లకు అందమైన లుక్ కోసం 'కార్ స్పా'

Car Spa
మనం అందగా కనపడానికి బ్యూటీ పార్లర్‌కు వెళ్తుంటాం. మరి మన వాహనం అందంగా కనపడాలంటే దాన్ని కూడా బ్యూటీ పార్లర్‌కు తీసుకువెళ్లాలి కదా..! కారును బ్యూటీ పార్లర్‌కు తీసుకువెళ్లడం ఏంటి అంటారా.. అయితే ఇది చదవండి..!

బకెట్లు బకెట్లు సోప్ వాటర్‌తో కారును కడగటం, స్పాంజ్‌తో శుభ్రం చేయటం వంటివి మర్చిపోండి. మీ కారుకు ఆల్-స్టార్ ట్రీట్‌మెంట్‌ను ఇప్పించాలంటే 'కార్ స్పా'కు తీసుకువెళ్లండి. అయితే, అది మన దేశంలో లేదు. దుబాయ్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ వాషింగ్. అక్కడ మీ కారును వాషింగ్ చేయించే డబ్బులతో మన దేశంలో ఓ మిడ్-సైజ్ సెడాన్ కారును కొనుక్కోవచ్చు.

మీ కారును క్లీన్ చేయడానికి వాళ్లు చార్జ్ చేసే డబ్బులు ఎంతో తెలుసా.. జస్ట్ 10,000 పౌండ్లు మాత్రమే. అంటే.. మన దేశ కరెన్సీలో సుమారు రూ. 7,23,007 మాత్రమే. మరి ఇంతకీ వాళ్లు చేసేది ఏంటనే కదా మీ సందేహం. అదేంటంటే.. మీ కారును వేళ్లతో ముట్టుకోకుండా వాళ్లు క్లీన్ చేస్తారు. అదెలా కారును ముట్టుకోకుండా క్లీనింగ్ ఎలా సాధ్యం అంటారా..! మరి అదే.. ఈ కారు క్లీనింగ్ స్పెషాలిటీ, అందుకే అంత కాస్ట్ కూడానూ.

దుబాయ్‌కు చెందిన మొన్జా అల్టిమేట్ డీటైలింగ్ అండ్ ప్రొటెక్షన్ అనే కార్ వాష్ కంపెనీ ఈ సేవలను అందిస్తోంది. ఇందుకు గానూ ప్రత్యేకంగా ''నో-టచ్" టెక్నిక్‌తో నానో-టెక్నాలజీని ఉపయోగించి వాటర్ ట్రీట్‌మెంట్, టెంపరేచర్, ప్రెజర్‌ల కాంబినేషన్‌తో కారుకు అత్యత్తుమ ఫినిషింగ్ వచ్చేలా చేస్తారు. అలాగని అన్ని కార్లకు ఈ ట్రీట్‌మెంట్‌ను చేయరు. హై-ఎండ్ లగ్జరీ కార్లయిన రోల్స్ రాయిస్, ఫెరారీ, జాగ్వార్, మాసేరటి, లాంబోర్గిని వంటి కార్లకు మాత్రమే ఈ లగ్జరీ కార్ వాషింగ్‌ను చేస్తారు.

సాధారణ నీటిలో మినరల్స్, యాసిడ్స్ ఉంటాయి. అందుకే కారు క్లీన్ చేసిన తర్వాత కూడా కారుపై నీటి బిందువుల మరకలు కనిపిస్తుంటాయి. కానీ నానో టెక్నాలజీలో అలా కాదు, ఇందులో మరకలు, గీతలను పూర్తిగా తొలగించి మీ కారు కొత్త దానిలా ధగ ధగ మెరిసేలా చేస్తారు. ఇలా ఒక్కో కారుకు 'కార్ మసాజ్' చేయడానికి కనీసం మూడు రోజులు సమయం పడుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 26, 2011, 18:52 [IST]
English summary
Give your car an ultimate 5 star treatment. Dubai-based car wash, named Monza Ultimate Detailing and Protection Starting "Car Spa". The 10,000 pounds wash is for customers who own their own custom built cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+