డీజిల్‌పై ప్రణబ్ వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన ఆటో సెక్టార్..!

వామపక్షాలు చేసిన ఈ ప్రతిపాదనను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ప్రణబ్ ముఖర్జీ లోక్ సభకు తెలియజేశారు. అంటే.. ప్రభుత్వం పొమ్మనుకుండానే పొగ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పెట్రోల్ ధరల మాదిరిగానే డీజిల్ ధలపై కూడా నియంత్రణ ఎత్తివేయాలని ఎప్పటినుంచే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు సరైన సమయం కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఇప్పడు ప్రభుత్వానికి ఓ చక్కని అవకాశం లభించినట్లయింది. వామపక్షాల ప్రతిపాదన నెపంతో డీజిల్‌పై ప్రభుత్వ నియంత్రణలను ఎత్తివేయకుండా సబ్సిడిని ఎత్తివేస్తే చాలనేది కేంద్ర ప్రభుత్వం యోచన.
అయితే, రైతులు మరియు రవాణా ట్రక్కులు వినియోగించే డీజిల్‌పై మాత్రం సబ్సిడిని కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. ఈ ద్వంద్వ ధరల విధానం గనుక అమలులోకి వస్తే.. ప్యాసింజర్ కార్లు వినియోగించే డీజిల్‌పై లీటరుకు రూ. 6.82 పైసలు పెరగడం ఖాయం. కాగా... ఇప్పటికే పెరిగిన వడ్డీ రేట్లు మరియు అధిక ఇన్‌పుట్ కాస్ట్‌లతో ప్యాసింజర్ కార్ల తయారీదారులు సతమతవుతుంటే.. ప్రణబ్ చేసిన వ్యాఖ్యలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అలాగే, ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరల బాధ నుండి తప్పించుకునేందుకు డీజిల్ కార్లను ఆశ్రయించాలనుకుంటున్న డీజిల్ కార్ల కొనుగోలుదాలకు కూడా ఇది చేదు వార్తనే చెప్పాలి.
డీజిల్‌పై ద్వంద్వ ధరల ప్రతిపాదనను ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా వ్యతిరేకించింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) అధ్యక్షుడు పవన్ గోయెంకా మాట్లాడుతూ.. మార్కెట్‌ను నడుపుతోంది డీజిల్ ధరలేనని, దీన్ని ఎస్ఐఏఎమ్ వ్యతిరేకిస్తోందని, ఇది పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం డీజిల్ కార్ల డిమాండ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని దేశీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా పేర్కొంది. మరో కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ఇండియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications








