పండుగ సీజన్: కార్‌మేకర్స్ నుంచి భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు

Hyundai i10
మనకు తొలి ఏకాదశి వచ్చిందంటే పండుగ సీజన్ ప్రారంభమైనట్లే.. ఇటు గృహాలు అటు దుకాణాలు పండుగ వాతావరణంతో సందడి నెలకొంటాయి. వ్యాపారస్తులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లు, స్కీమ్‌లను ప్రకటిస్తుంటారు. ప్రత్యేకించి కార్ల తయారీదారులు మరియు డీలర్లకు ఈ పండుగ సీజన్ నిజంగా పండుగేనని చెప్పాలి. కొత్త కార్లపై భారీ నగదు ప్రోత్సాహకాలు మరియు బంపర్ ఆఫర్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి వారు సిద్ధంగా ఉన్నారు.

ఈ పండుగ సీజన్‌కు తోడు గడచిన కొద్ది నెలలుగా కార్ల విక్రయాలు మందగిస్తుండటంతో వాటికి మరింత జోరును అందించేందుకు దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించనున్నాయి. దీంతో కార్ల తయారీదారులు అందిస్తున్న అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లు చౌక ధరకే లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ముద్దుల కారు ఆల్టోపై రూ. 50,000 డిస్కౌంట్‌ను ఆఫర్ చేయనుంది.

అలాగే, వ్యాగన్ఆర్, ఎస్టిలో మోడళ్లపై కూడా డిస్కౌంట్లను అందించనున్నట్లు మారుతి సుజుకి ఛీఫ్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. జపనీస్ కార్ల దిగ్గజమైన హోండా కూడా ఇప్పటికే సిటీ సెడాన్ కారు ధర రూ. 66,000 తగ్గించగా మరోసారి సిటీ సెడాన్‌పై రూ. 50,000 డిస్కౌంట్‌ను ఆఫర్ చేయనుంది. హోండా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ "జాజ్" మోడల్‌పై భారీగా రూ. 1.75 లక్షల డిస్కౌంట్‌ను కంపెనీ అందించనుంది.

భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ కూడా అద్భుతమైన స్కీమ్‌లను ఆఫర్ చేస్తుంది. శాంత్రో జింగ్ మరియు ఐ10 మోడళ్లపై 5.99% వడ్డీ రేటుకే కార్ లోన్స్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ రెండు మోడళ్లు కూడా హ్యుందాయ్ నుంచి అత్యధికంగా అమ్మడవుతున్న మోడళ్లు. కాగా.. జర్మనీకు చెందిన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ఇప్పటికే వెంటో పెట్రోల్ సెడాన్‌ను 6.99% వడ్డీకే అందిస్తోంది. అలాగే, జర్మన్ లగ్జరీ కార్ల తయారీదారులైన బెంజ్ సిక్లాస్ సెడాన్‌పై మరియు ఆడి ఏ4 సెడాన్‌లపై జీరో ఇంట్రెస్ట్ లోన్‌లను ఆఫర్ చేయనున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, July 14, 2011, 18:30 [IST]
English summary
Indian carmakers are offering huge discounts and schemes to improve their sales performance. Following the drastic reduction in sales in June carmakers are being forced to offer more discounts or risk loosing market share. Even carmakers who enjoy huge market shares haven't been spared by the reduced sales. Best selling models of these carmakers are now cheaper due to the discounts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+