రూ. 25,000 మేర పెరగనున్న కార్ల ధరలు..!

Car Prices Hike
కొత్త కారు కొనుక్కోవాలనుకుంటున్నారా.. అయితే త్వరపడండి. ఒక్క నెల ఆలస్యం చేశారంటే ప్రస్తుత ధర కన్నా అధనంగా డబ్బులు చెల్లించి కారు కొనాల్సి వస్తుంది. దేశంలో ఓ వైపు వాడి వేడిగా బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. మరోవైపు భారత మార్కెట్లోని దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు ధరల పెంపుతో కొనుగోలుదారుల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను 2-3 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయి. అంటే కనీసం పది వేల రూపాయల నుండి పాతిక వేల రూపాయాల వరకూ ధరలు పెరగవచ్చన్నమాట.మారుతి స్విఫ్ట్, హోండా జాజ్, హ్యుందాయ్ ఐ10 వంటి కార్లు సగటున రూ. 10,000, అలాగే స్కోడా సూపర్బ్, టొయోటా కరోలా వంటి కార్లు రూ. 25,000 పెరిగే అవకాశం ఉంది.

కమోడిటీస్ (ముడిసరుకుల) ధరలు నానాటికీ పెరుగుతున్న తరుణంలో ధరల వత్తిడి కంపెనీలపై అధికంగా ఉండటం వలన ఉత్పత్తుల ధరలు పెంచక తప్పదని దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి పేర్కొంది. కార్ల తయారీలో ఉపయోగించే ఉక్కు, రబ్బర్ ధరలు చుక్కలనంటుతుండటంతో సదరు సప్లయర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను పునరుద్ధరించుకోవాల్సి వస్తుందని కంపెనీ వివరించింది. గడచిన కొద్ది నెలలుగా గమనిస్తే.. కాపర్, నికెల్, అల్యూమినియం ధలు కూడా 20-45 శాతానికి పెరిగాయి. ఇటీవల ఇదే కారణంతోనే మారుతి సుజుకి తమ కార్ల ధరలను 2.4 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే.

ఈ ముడిసరుకుల ధరల పెరుగుదల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హీరో హోండా, మారుతి సుజికి కంపెనీల నికరలాభాల్లో (సంవత్సరం నుంచి సంవత్సరానికి) 20 శాతం నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. దేశంలో అతిపెద్ద ఆటో కంపెనీలైన మారుతి, హీరో హోండాలే ఇంత నష్టాలను భరించినప్పుడు చిన్నతరహా ఆటో కంపెనీలు ఎంత మాత్రం నష్టం వాటిల్లి ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. కానీ సదరు కంపెనీలు నష్టాల విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడ్డాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టొయోటా కంపెనీ కూడా ధరల పెంపు విషయంపై వచ్చే నెలలో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 26, 2011, 12:57 [IST]
English summary
Almost every car maker in the Indian market is scheduling the revision of prices for its cars by 2-3% in March. This may convert to Rs10000 to a car from Maruti Swift , Honda Jazz and i20 from Hyundai. The price of Skoda Superb and Toyota Corolla may rise by Rs25000 due to this hike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+