నంబర్ ప్లేట్‌లో 'Z' ఉన్న కార్లకు ఎక్కువ ప్రమాదాలు: స్టడీ

కాగా.. వీటిలో 4,23,870 ప్రమాదాలు డ్రైవర్ తప్పిదాల కారణంగా జరిగితే.. 2,14,069 యాక్సిడెంట్లు డ్రైవర్ తప్పు లేకపోయినప్పటికీ జరిగినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఎన్‌సిజెడ్ (NCZ), డికెవై (DKY), ఏడబ్ల్యూజెడ్ (AWZ), ఎల్‌జివై (LGY) మరియు ఏఏజెడ్ (AAZ) సిరీస్ రిజిస్ట్రేషన్ నంబర్లు కలిగిన వాహనాలు యాక్సిడెంట్లలో టాప్ ఫైన్ స్థానాల్లో ఉన్నాయని, డ్రైవర్ తప్పిదం లేకుండా జరిగిన ప్రమాదాల్లో ఆర్ఎమ్‌జెడ్ (RMZ) సిరీస్ వాహనాలు అధికంగా ఉన్నాయని ఆ సర్వే పేర్కొంది.
NCZ సిరీస్‌లో డ్రైవర్ తప్పిదం కారణంగా 88 కేసులు నమోదవుతుంటే.. RMZ సిరీస్‌లో డ్రైవర్ తప్పిదం కారణంగా 44 కేసులు నమోదవుతున్నట్లు సర్వే పేర్కొంది. అయితే ఈ అంశంపై బీమా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ మార్టిన్ మాట్లాడుతూ.. ఖచ్చితంగా ఈ ప్రమాదాలు కేవలం యాధృచ్చింగా జరిగినవి మాత్రమేనని, ఈ ప్రమాదాలకు రిజిస్ట్రేషన్ నంబరే కారణమని చెప్పలేమని అన్నారు. బ్రిటీష్ పత్రిక డెయిలీ మెయిల్ ఈ కథనాన్ని ప్రచురించింది.


Click it and Unblock the Notifications








