సియట్ క్యూ4 లాభాలకు పంక్చర్.. ఉత్పత్తుల ధరల పెంపు!

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ లాభాలు భారీగా క్షీణించాయి. మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికానికి గానూ సియట్ లాభాలు రూ. 1,186 లక్షలకు పడిపోయాయి. గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభాలు రూ. 1,533 లక్షలుగా ఉన్నాయి. ఇఖ నికర అమ్మకాల విషయానికి వస్తే.. రూ. 770 నుంచి రూ. రూ. 978 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ సహజ రబ్బరు ధర 14 శాతానికిపైగా పెరిగింది. దీంతో ఒక టైరు తయారీపై అదనంగా 40 శాతం భారం పడుతోందని కంపెనీ తెలిపింది.
ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 150 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా వెచ్చించనున్నామని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఎగుమతులు 50 శాతం పెరుగుతాయని సియట్ అంచనా వేస్తోంది. గుజరాత్‌లోని హలోల్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన రేడియల్ టైర్ల ప్లాంటులో కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు దాదాపు రూ. 100 కోట్ల రూపాయలను వెచ్చించనున్నామని కంపెనీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా తెలిపారు.


Click it and Unblock the Notifications








