ఇయాన్ సెలబ్రేషన్ ఆఫర్ డిసెంబర్ 14న ముగింపు

అయితే, ఈ మోడల్ అమ్మకాలు ఆశించినంతగా సాగకపోవడంతో, ఇయాన్ అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దీనిని సెలబ్రేషన్ ఆఫర్‌గా కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్‌లో భాగంగా హ్యుందాయ్ ఇయాన్ కొనుగోలుపై రూ.10,000 విలువైన ఇన్సూరెన్స్‌ను ఉచితంగా అందిస్తుండగా, అంతే సమానమైన మొత్తంలో ఎక్సేంజ్/లాయల్టీ బోనస్‌లను కూడా ఆఫర్ చేస్తుంది.
ఈ సెలబ్రేషన్ ఆఫర్లు డిసెంబర్ 14వ తేదీన ముగియనుంది. ఇదిలా ఉండగా, సిఎన్‌బిసి-టివి18 ఓవర్‌డ్రైవ్ అవార్డులలో మైక్రో/మినీ కార్ సెగ్మెంట్లో హ్యుందాయ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకుంది. హ్యుందాయ్ ఇయాన్ కారులో అమర్చిన 3-సిలిండర్, 815 సీసీ ఇంజన్ 56 పిఎస్‌ల శక్తిని, 76.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. హ్యుందాయ్ ఇయాన్ చిన్న కారు లీటరు పెట్రోల్‌పై 21.1 కి.మీ. మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications








