చెవర్లే ఖాతాలో మరో అరుదైన రికార్డ్: 10 లక్షల క్రూజ్ సేల్స్

Chevy Cruze
అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌కు చెందిన చెవర్లే బ్రాండ్ గురువారం నాటితో 100 విజయవంతమైన సంవత్సరాలను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చెవర్లే నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న 'చెవర్లే క్రూజ్' కార్ కొనుగోలుదారులకు కంపెనీ ధన్యవాదములు తెలుపుకుంది. చెవర్లే అందిస్తున్న ఈ కాంపాక్ట్ కారు 2009 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

అప్పడి నుండి ఇప్పటి వరకూ 10 లక్షలకు పైగా చెవర్లే క్రూజ్ కార్లు అమ్ముడుపోయాయి. స్టైల్, కంఫర్ట్, ఫ్యూయెల్ ఎఫీషియన్సీ మరియు సేఫ్టీల కలయిక అయిన చెవర్లే క్రూజ్ ఈ సంవత్సరం అమెరికాలో ఇప్పటి వరకూ టాప్ సెల్లింగ్ మోడల్‌గా నిలుస్తూ వచ్చింది. ఇదే సెగ్మెంట్లో హోండా, టొయోటా, హ్యుందాయ్, కియా మరియు ఫోర్డ్ కంపెనీల కన్నా చెవర్లే ప్రధమ స్థానంలో నిలిచింది.

గత 2009లో విడుదల చెవర్లే క్రూజ్‌కు టాప్ 10 మార్కెట్లలో ఇండియా కూడా ఉండటం విశేషం. ఈ జాబితాలో వరుసగా.. చైనా, అమెరికా, రష్యా, కెనడా, మెక్సికో, ఇండియా, టర్కీ, దక్షిణ కొరియా, ఇజ్రాయేల్ మరియు స్పెయిన్ దేశాలు ఉన్నాయి. సుమారు 100కు పైగా దేశాలలో క్రూడ్ అమ్మడువుతోంది. చెవర్లే ప్రస్తుత సంవత్సరంలో క్రూజ్‌లో ఓ ఫైవ్-డోర్ హ్యాచ్‌‌బ్యాక్‌ను యూరప్ మార్కెట్లో విడుదల చేసింది.

More from DriveSpark

Article Published On: Friday, November 4, 2011, 14:00 [IST]
English summary
Chevrolet is celebrating its Centennial today by saying thanks a million literally to buyers of its top-selling Chevrolet Cruze. The compact car, which launched globally in 2009 and in North America in 2010, reached 1 million sales this week.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+