జూన్ నెలలో చెవర్లెట్ బీట్ డీజిల్ వేరియంట్ విడుదల

ఒక లీటర్ ఇంజన్ సామర్థ్యం కలిగిన చెవర్లెట్ బీట్ డీజిల్ ఇంజన్‌లను తాలేగావ్ ప్లాంటులోనే రూపొందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందుకు గానూ కంపెనీ 230 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా వెచ్చించి వార్షికంగా 1.60 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ఈ పెట్టుబడుల ద్వారా దేశీయ మార్కెట్లో ఓ ఇంజన్ ప్లాంటును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే గనుక జరిగితే దాదాపు 95 శాతం పరికరాలు (స్పేర్స్) భారత మార్కెట్లోనే లభ్యమవుతాయి.
అంతేకాకుండా... ఈ ఏడాది మధ్య భాగంలో జనరల్ మోటార్స్ అందిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ తవేరాలో మరో వేరియంట్ "యూరో -IV"ను కూడా విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా.. రానున్న రెండేళ్లలో కొత్తగా ఆరు మోడళ్లను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు జీఎమ్ తెలిపింది. కొత్తగా రాబోయే ఈ ఆరు మోడళ్లలో ఒక సెడాన్, ఒక ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్), ఒక పిక్-అప్, ఒక ఎమ్‌యూవీ (మల్టీ యుటిలిటి వెహికల్), అప్‌గ్రేడెడ్ ప్రిమీయం ఎస్‌యూవీ కాప్టివా, ఓ చిన్నకారు ఉంటాయని కంపెనీ వివరించింది.


Click it and Unblock the Notifications








