జులై 2011లో చెవర్లే బీట్ డీజిల్ వేరియంట్ విడుదల

ఈ నేపథ్యంలో చెవర్లే బీట్ డీజిల్‌కు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. కొత్త బీట్ డీజిల్ 1.0 లీటర్ డీజిల్ ఇంజన్‌తో 57 బిహెచ్‌పిల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా మైలేజ్ విషయంలో కూడా ఇది ధీటుగా రాణింటే సూచనలనున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం చెవర్లే డీజిల్ లీటరుకు 24 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వనుంది (టాటా ఇండికా ఈవీ2 డీజిల్ మైలేజ్ 25 కెఎమ్‌పిఎల్). 2010లో చెవర్లే బీట్ భారత మార్కెట్లో అడుగుపెట్టింది. పెట్రోల్ వేరియంట్‌లో లభ్యమవుతున్న కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో బీట్ పాపులర్ మోడల్‌గా ఉంది. ఈ మోడల్‌లో డీజిల్ వేరియంట్ రాగానే ప్రస్తుతం మార్కెట్లో రాజ్యమేలుతున్న ఫోర్డ్ ఫిగో, ఫోక్స్‌వ్యాగన్ పోలో, నిస్సాన్ మైక్రా, మారుతి స్విఫ్ట్, రిట్జ్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మార్కెట్లో దీని ధర రూ. 4.5 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఉండవచ్చునని అంచనా. దాదాపుగా పెట్రోల్ వెర్షన్‌లో ఫీచర్లే డీజిల్ వెర్షన్‌లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








