త్వరలో భారత్‌కు రానున్న జీఎమ్ స్పోర్ట్స్ కార్ 'చెవర్లెట్ కామరో'

Chevrolet Camaro
స్పోర్ట్స్ కార్ లవర్స్ కోసం అమెరికాకు చెందిన జనరల్ మోటార్ (జిఎమ్) సంస్థ మరో సరికొత్త కారను అతి త్వరలోనే దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే మాసేరటి, ఫెరారీ, కొయినిగ్‌సెగ్గ్ వంటి పలు విదేశీ సంస్థలు స్పోర్ట్స్ కార్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి జనరల్ మోటార్స్ కూడా చేరిపోనుంది. "చెవర్లట్ కామరో" పేరుతో ఓ సరికొత్ స్పోర్ట్స్ కారును జీఎమ్ విడుదల చేయనుంది. కొత్తగా విడుదల చేయబోయే కారు స్పోర్ట్ కార్ ప్రియులను ఆకట్టుకుంటుందని, ప్రారంభ మోడల్‌లో కుడిచేతి వైపు డ్రైవింగ్‌తో పాటు రెండు డోర్లు కలిగి ఉంటుందని కంపెనీ అధ్యక్షుడు వివరించారు.

గతేడాది జరిగిన ఆటో ఎక్స్‌పో 2010లో జనరల్ మోటార్స్ ఈ కారును ప్రదర్శనకు ఉంచింది. కానీ ప్రపంచంలో రెండవ అతిపెద్ద వృద్ధి చెందుతున్న మార్కెట్లో (భారత్) ఇంత త్వరగా విడుదల చేయగలమని కంపెనీ ఊహించలేదు. కాగా.. కామరో కారుకు సంబంధించి ధరను కానీ.. లేదా ఖచ్చితమైన విడుదల తేదీని కానీ ఆయన ప్రకటించలేదు. అయితే కామరో ధర దాదాపు రూ. 30 లక్షలు ఉండవచ్చునని అంచనా. ఈ అంచనా కనుక నిజమైతే ప్రపంచంలోనే అత్యంత చవకైన స్పోర్ట్స్ కార్‌గా కామరో నిలువనుంది. అంతేకాకుండా.. భారత్‌లో జనరల్ మోటార్స్ అందిస్తున్న అన్ని కార్ల శ్రేణిలో ఇదే అత్యంత ఖరీదైన కారుగా కూడా నిలువనుంది.

కాగా.. అమెరికాలో చెవర్లట్ కామరో ప్రారంభ మోడల్ ధర 20,000 డాలర్లుగాను, హై-ఎండ్ వేరియంట్ మోడల్ ధర 40,000 డాలర్లు గాను ఉంది. కామరో విడుదలతో భారత్‌లో తమ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 29, 2011, 14:43 [IST]
English summary
The sports car lovers in India are in enthralling mood that so many brands have been invading the Indian market. Already the segment is filled with Maserati, Ferrari, Koenigsegg and now GM has pleased the lovers with its Chevrolet Camaro slated for launch soon. This iconic sports car is intended to vibrate the sports car lovers as the company’s president said the initial launch will be the right hand drive with two door design.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+