స్విఫ్ట్ పోటీగా సెయిల్‌ను ప్రవేశపెట్టనున్న జనరల్ మోటార్స్

Chevy Sail
మార్కెట్ లీడర్ మారుతి సుజుకి అందిస్తున్న కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ "స్విఫ్ట్"కు పోటీ ఇవ్వడానికి భారత మార్కెట్లోకి ఎన్నో కొత్త మోడళ్లు ప్రవేశించినప్పటికీ, స్విఫ్ట్ వేగానికి తట్టుకోలేకపోయాయి. ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశించిన పలు చిన్న కార్లు కూడా స్విఫ్ట్‌కు కనీసం సమీప పోటీదారుగా కూడా రాణించలేకపోయాయి. అయితే, తాజాగా మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ తన చెవర్లే బ్రాండ్‌లో ఓ సరికొత్త మోడల్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది.

చైనాలో అభివృద్ధి చేసిన ఓ చిన్న కారును జనరల్ మోటార్స్ దేశీయ విపణిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. "చెవర్లే సెయిల్" అనే పేరు కలిగిన ఈ చిన్న కారు ఇంచుమించు స్విఫ్ట్ పరిమాణంలోనే ఉండి, చెవర్లే బ్రాండ్‌లో అత్యధికంగా అమ్మడవుతున్న చిన్న కారు బీట్‌కు ఎగువన జనరల్ మోటార్స్ ప్రవేశపెట్టనుంది. ఈ మోడల్‌ను జనరల్ మోటార్స్‌కు చెందిన చైనా డివిజన్ రూపొందించింది. ఇప్పటికే చైనా మార్కెట్లో చెవర్లే సెయిల్ కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను గానీ లేదా మరింత శక్తివంతమైన 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను గానీ అమర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతానికి డీజిల్ ఇంజన్‌కు సంబంధించిన సమాచారం మాత్రం వెల్లడి కాలేదు. ప్రస్తుతం భారత మార్కెట్లో డీజిల్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఒకవేళ డీజిల్ వేరియంట్ సెయిల్ కారును ప్రవేశపెట్టాల్సి వస్తే, ఫియట్, జిఎమ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 1.3 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో చెవర్లే బ్రాండ్‌లో లభిస్తున్న ఏవియో అంతగా విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఏవియో స్థానాన్ని సెయిల్ స్థానంతో జిఎమ్ భర్తీ చేసే ఆస్కారం ఉంది. అలాగే, అప్‌గ్రేడెడ్ ఏవియో యూవీఏ మోడల్ అమ్మకాలు కూడా ఆశించినంతగా సాగడం లేదు. ఏవియో కన్నా సమర్థవంతమైన 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ సెయిల్‌లో ఉండనుంది. చెవర్లే సెయిల్ ధర మరియు ఇతర సాంకేతిక వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, December 10, 2011, 10:14 [IST]
English summary
The Maruti Suzuki Swift is undoubtedly one of the most loved cars in India. But its position on the top is being challenged by several new cars. The Skoda Fabia, Hyundai i20, Toyota Etios Liva, Ford Figo are some of the cars that we can name as potential contenders to replace the Swift. General Motors which so far was not competing the compact car segment is planning to launch a car that it has developed in China. The new car named as the Chevrolet Sail is of the same size as the Swift and might be placed above GM's best selling model Beat.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+